సొమ్ము సర్కార్ ది .. సోకు మిల్లర్లది కామధేనువుగా  కస్టమ్స్ మిల్లింగ్ రైస్ !

👉 రైస్ మిల్లర్ల వద్దనే కోట్లాది రూపాయల ధాన్యం, బియ్యం నిల్వలు !

👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తూ తు మంత్రంగా దాడులు..

J. SURENDER KUMAR,

ప్రభుత్వం అమలు చేస్తున్న ( CMR ) కస్టమ్స్ మిల్లింగ్ రైస్ విధానం, రైస్ మిల్లర్ల పాలిట వరంగా మారింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం ‘ రా , ‘ బాయిల్డ్ , మిల్లర్లకు కేటాయించడంతో, సర్కారు పెట్టుబడి  సొమ్ము తో మిల్లర్లు సకాలంలో బియ్యాన్ని ఎఫ్ సి ఏ కి అప్పగించకున్న వారిని అడిగే అధికార యంత్రాంగమే కరువైంది.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదో మొక్కుబడిగా ఒకటి, రెండు మిల్లులలో అధికారులు తనిఖీల పేరిట దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లర్లు  మాత్రం పెట్టుబడి లేని రైస్ వ్యాపారం చేస్తు కోట్లల్లో లాభాలు గడిస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి..

జగిత్యాల జిల్లాలో 2022- 23  ఖరీఫ్ సంబంధించి ‘ రా ‘  రైస్ మిల్లులకు ప్రభుత్వం కస్టమ్స్ మిల్లింగ్ రైస్ కోసం 2023 జులై 13 నాటికి 69  రైస్ మిల్లర్లకు 143834.740 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించింది. 10848.603 మెట్రిక్ టన్నుల కస్టమ్స్ మిల్లింగ్ రైస్, ఎఫ్ సి ఐ కి మిల్లర్లు అప్పగించాల్సి ఉంది.  కస్టమ్స్ మిల్లింగ్ రైస్ మాత్రం  ప్రభుత్వం  కేవలం 11 శాతమే. సేకరించినట్టు ప్రభుత్వ రికార్డులలో నమోదయింది.

👉 63 బాయిల్డ్ రైస్ మిల్లులకు..

జిల్లాలో 63 బాయిల్డ్  రైస్ మిల్లులకు,194352.260 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించారు. 7234.299 మెట్రిక్ టన్నుల కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ఎఫ్ సి ఐ కి మీరు అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం కేవలం 19 శాతమే సేకరించినట్టు రికార్డులలో నమోదయింది.

👉 ఒక క్వింటల్ ధాన్యం మిల్లింగుకు ₹ 15/-

ధాన్యం మిల్లింగుకు ప్రభుత్వం రైస్ మిల్లర్లకు  క్వింటాలు ఒక్కంటికి ₹ 15/- ( 15 రూపాయలు చెల్లిస్తుంది). ఇందులో 18 శాతం జీఎస్టీ (GST) కాగా క్వింటాల్ వడ్లకు బాయిల్డ్ రైస్ 68 కిలోలు, ‘రా’ రైస్ 67 కిలోలు ప్రభుత్వానికి మిల్లర్లు అప్పగించాల్సి ఉంటుంది.  ప్రభుత్వ గోదాములలోకి  బియ్యం తరలించడానికి 12 km  లోపు పరిధిలో రవాణా ఖర్చులను. మిల్లర్లే భరించాల్సి ఉంటుంది. మిల్లింగులు వచ్చిన తౌడు, నూకలు, ఉనక, మిల్లర్లకే. కాగా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు చెల్లించడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

👉 మొక్కుబడిగా దాడులు… కేసులు నమోదు.

కోరుట్లలో ఉదయ్ రైస్ మిల్ పై దాడి(ఫైల్ ఫోటో)

ఈనెల18 న కోరుట్ల పట్టణంలోని ఉదయ్ రైస్ మిల్ లో పౌరసరఫరా  అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడులలో ఉదయ్ రైస్ మిల్, లో వానాకాలం 2022-23 కి సంబంధించి  29563.00 క్వింటల్ల ధాన్యం దిగుమతి చేసుకున్నట్టు రికార్డులో నమోదయింది. అధికారుల దాడులలో కేవలం 4500.00 క్వింటల్ల ధాన్యం మాత్రమే మిల్లులో నిల్వ ఉన్న ఉదంతం వెలుగు చూసింది.  25063.00 క్వింటల ధాన్యం మిల్లులో అగుపించలేదు. దీంతో అధికారులు రైస్ మిల్లు పై 6A కేసుతో పాటు, క్రిమినల్ కేసు నమోదు చేశారు.

👉 హుజురాబాద్ లో చైర్మన్ దాడులు చేసిన ప్రభుత్వానికి చేరని కోట్లాది రూపాయల బియ్యం

హుజురాబాద్లో పౌర సరఫరాల చైర్మన్ రవీందర్ సింగ్ దా డిలో పాల్గొన్న దృశ్యం ( ఫైల్ ఫోటో)


గత కొన్ని రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో  హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వానికి బకాయిపడ్డ కస్టమ్స్ బియ్యాన్ని చెల్లించని రైస్ మిల్లులపై  పౌర సరఫరాల సంస్థ ఛైర్మెన్ రవీందర్  సింగ్, అధికారులతో కలిసి దాడులు చేసినా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ మాత్రం ప్రభుత్వానికి చేరనట్టు సమాచారం.  హుజూరాబాద్ లోని పలు రైస్ మిల్లులపై సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 20 మంది అధికారులు వరుణ్ ఇండస్ట్రీ, గోమాత రైస్ మిల్, లక్ష్మి గణపతి రైస్ ఇండస్ట్రీ తదితర మిల్లులపై సోదాలు నిర్వహించారు. ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించిన ధాన్యంపై ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో  ప్రభుత్వానికి చెల్లించిన బియ్యం ఎన్ని ? మిగితా ధాన్యం రైస్ మిల్లులో నిల్వ ఉందా ?  లేదా ? అనే కోణంలో విచారణ చేపట్టారు. సివిల్ సప్లై అధికారుల వద్ద ఉన్న రికార్డులకు, రైస్ మిల్లుల్లో ఉన్న స్టాక్ రిజిష్టర్ లో నిల్వలకు సంబంధించి తేడాలు గుర్తించారు.

హుజురాబాద్లో రైస్ మిల్స్ చేస్తున్న విజిలెన్స్ అధికారులు(ఫైల్ ఫోటో)

అధికారుల దాడులలో   2022-23 సంవత్సరానికి మహాలక్ష్మి రైస్ మిల్ యాజమాన్యం ₹ 7కోట్ల 32 లక్షల విలువగల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా స్టాక్ పెట్టుకున్నట్టు అధికారుల దాడులలో వెలుగు చూసినట్టు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో మచ్చుకు కొన్ని రైస్ మిల్లులలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబోలు..