తెలంగాణలో చంద్రబాబు వారసత్వ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తో సహా సగం మంది మంత్రులు!

👉 టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెరాస ఉద్యమ పార్టీ నుంచి రాజకీయాల్లోకి..

👉 ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి టిడిపిలో చేరారు.

👉 పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడి వారసత్వ ప్రభుత్వాన్ని  కొనసాగిస్తున్నారని సగం మంది మంత్రుల పూర్వపు పుట్టక తెలుగుదేశం పార్టీ అని సీఎం కేసీఆర్ తో సహ వీరు చంద్రబాబు శిష్యులని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాల లోని ఆయన స్వగృహం ఇందిరా భవన్ లో సోమవారం మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ ఉచిత విద్యుత్తు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలకు దీటుగా ప్రత్య ఆరోపణలు చేశారు.
జీవన్ రెడ్డి మాటల్లో…

👉 తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ చంద్రబాబు శిష్యరీకం పోచారం శ్రీనివాస్ రెడ్డి .గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ,తలసాని  శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎర్రవెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, మీ నాయకుడు కేసీఆర్  అందరూ టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు కాదా ? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో 90 శాతం చంద్రబాబు టీ డీ పీ లో నుండి వచ్చిన వారే..కెసిఆర్ ఎక్కడికెల్లి వచ్చిండు..టిడిపి నుండి రాలేదా ? అని నిలదీశారు..16మంది కేబినెట్ లో మంత్రుల్లో ముగ్గురు మినహా అందరూ టీడీపీ నుండి వచ్చారు .ఇప్పుడు సాగుతున్న కేబినెట్ చంద్రబాబు మంత్రి వర్గం అని,నేడు తెలంగాణ రాష్ట్రంలో చంద్ర బాబు వారసత్వ ప్రభుత్వం నడుస్తోంది జీవన్ రెడ్డి ఆరోపించారు.
👉 పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయంలోకి వచ్చాడని,ఇండిపెండెంట్ జడ్పిటిసిగా, ఎమ్మెల్సీగా గెలిచి 2007 లో తెలుగుదేశం పార్టీలో చేరాడని. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ చరిత్ర, అని మంత్రి  కేటీఆర్  రాజకీయ చరిత్ర తెలియకుండా ఆరోపణలు చేయడం తగదని జీవన్ రెడ్డి హితవు పలికేరు
.

👉 చంద్రబాబు నాయుడు దయా దక్షిణ్యాలతో రాజకీయ పదవులు అనుభవించి న కెసిఆర్  బాబు తిరిగి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణ ఉద్యమం ఎన్నుకున్నాడని..కెసిఆర్ కు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమం చేసేవాడా..? అనే జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
👉 రాహుల్ గాంధీ కి ఎడ్లు తెలియవు.. ఎవుసం తెలియదన్న కేటీఆర్ వ్యాఖ్యల పై.. ఎడ్లు.. ఎవుసం నీకు తెలుసా.?  అని కేటీఆర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు..
👉 మీలాగా  వాస్తవాలను వక్రీకరించడం రాహుల్ గాంధీ కి తెలియదనీ ఎద్దేవా చేశారు.రాహుల్ గాంధీ ఎక్కడా..నువ్వు ఎక్కడ.ఉచిత విద్యుత్ ప్రారంభించిన్నప్పుడు, కేటీఆర్ కు కనీసం ఉచిత విద్యుత్ అంశం పై అవగాహన అయినా ఉందా..
ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నావు. ఉపాధి కోసం విదేశాల్లో ఉన్నావనీ మరిచి పోయావా అన్నారు..
👉 రాహుల్ గాంధీ భారత్ జోడో చేపట్టి కాశ్మీర్ నుండి కన్యకుమారి వరకు దేశ సమైక్యత కోసం కృషి చేశారు.మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని కేటీఆర్ ను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు.
👉 త్యాగాల పార్టీ కాంగ్రెస్..కాంగ్రెస్ ఎన్నికల్లో వాగ్దానం చేయక పోయినా రైతులను రుణ విముక్తి చేయాలని ఏక మొత్తంలో మాఫీ చేశాం..
👉 కాంగ్రెస్ పాలనలో పంట రుణాలు పూర్తి గా మాఫీ చేశాము.తెలంగాణ లో రైతులు విద్యుత్ పై అధికంగా ఆధారపడుతుండడంతో
రాహుల్ గాంధీ ఆధ్యర్యంలోరాష్ట్ర విభజనలో అధికంగా విద్యుత్ కేటాయించామని గుర్తు చేశారు..👉 కాంగ్రెస్ పాలనలో 9గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం..ఇచ్చినం..పంటకు సరిపడా విద్యుత్ ఇచ్చినం..విద్యుత్ కనెక్షన్ల పై ఆంక్షలు విధించలేదనీ గుర్తు చేశారు..రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రు.5000 ప్రోత్సాహం ఇచ్చాం..కల్లం కాడ వడ్లు జోకినం..దేశంలో ఎక్కడ లేనప్పుడు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ అందించాం..పరిశ్రమలకు కోత పెట్టి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేశామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

👉 తెలంగాణ రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర విభజన సమయంలో అధికంగా విద్యుత్ కేటాయించినం..

👉 రుణ మాఫీ పేరిట బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు గడుస్తున్న మాఫీ చేయకుండా దాటవేసే దోరణి అవలంబిస్తోంది.

👉 రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ళ నుండి 4 శాతం వడ్డీ రాయితీ చెల్లించలేదు..విత్తన రాయితీ లేదు..
రుణ మాఫీ అమలు చేయకపోవడంతో వడ్డీ భారం రైతులపై పడుతోంది..జూన్ 26 నుండి రోజుకో ఎకరం చొప్పున రైతు బంధు ఇస్తామని చెప్పి నేటికీ 5 ఎకరాల వరకే రైతుబందు ఇచ్చారు.ఇదేనా రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది అని నిలదీశారు..

👉 రాష్ట్రంలో యువరాజు అని చెప్పుకుంటారు కదా అని కేటీఆర్ ను ఉదహరిస్తూ…
రైతులు నష్టపోకుండా అదనపు తూకం అరికట్టే బాధ్యత లేదా. విత్తన రాయితీ కల్పించే బాధ్యత మీది కాదా…అని నిలదీశారు.
👉 తెలంగాణలో 4000 మెగా వేల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ఇంకా 2,400 మెగావాట్లా విద్యుత్ ఇంకా ప్రారంభించలేదు. ..
కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధించకపోవడం.. తెలంగాణ రాష్ట్ర హక్కులు సాధించకపోవడం  మీ చేతకానితనం కాదా..
రాష్ట్రంలో ఐటీఐఆర్ ను కొనసాగించలేకపోవడం మీ వైఫల్యం కాదా అని నిలదీశారు..
👉 కమిషన్ల బాగోతం కప్పిపుచ్చుకు నేందుకు…మోడీతో దోస్త్ చేశారని ఆరోపించారు.
రాబోయే శాసన సభ ఎన్నికలు తెలంగాణ రైతులు విద్యుత్ సరఫరాపై రెఫరెండం జరుగుతది.
👉 చంద్ర బాబు కాలం నుండి విద్యుత్ సరఫరాపై ఫైల్స్ బయట పెడుతామంటున్న  మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫైల్స్ ఎందుకు బయటపెడుత లేరని  ప్రశ్నించారు.
👉 సీఎం డీ ప్రభాకర్ పట్ల తమకు విశ్వాసం ఉందని, ఈ ఆరు నెలలుగా వ్యవసాయానికి ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారో  శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పాలన్నారు..
సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, సంఘనపట్ల దినేష్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కాంగ్రెస్ చొప్పదండి నియోజక వర్గ అద్యక్షుడు మేడిపల్లి సత్యం,
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, నక్క జీవన్, జున్ను రాజేందర్, పుప్పాల అశోక్, మునేంధర్ రెడ్డి, చందా రాధా కిషన్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాష, కాంగ్రెస్ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేహాల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు బొల్లి శేఖర్, మైనారిటీ సెల్ పట్టణ కార్యదర్శి హబీబ్, యూత్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా మధు, మహిపాల్, బీరం రాజేశం పాల్గొన్నారు.