ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టుటకు ప్రభుత్వం చొరవ చూపాలి !

తపస్ ప్రధాన కార్యదర్శి నవత్ సురేష్.

J. SURENDER KUMAR,

అర్ధాంతరంగా ఆగిపోయిన బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను చేపట్టుటకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తపాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత సురేష్ ప్రభుత్వాన్ని కోరారు,
ధర్మపురి మండల కేంద్రంలో శనివారం జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల ప్రత్యేక సమావేశానికి నవత్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57వ మెమో ద్వారా 2002, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కింద పనులు నాణ్యమైన మౌలిక వసతులను కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లను నియమించాలని దీని ద్వారా పాఠశాలలో పరిశుభ్రతమైన వాతావరణం నెలగోల్ప బడుతుందని అన్నారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బాధ్యులు ఆయిల్నేని నరేందర్ రావు, వీరమళ్ళ వెంకటరమణ రావు , రొట్టె శ్రీనివాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోనగిరి దేవయ్య, ప్రధాన కార్యదర్శి బోయినపెల్లి ప్రసాదరావు, జిల్లా బాద్యులు కాశెట్టి రమేష్ ,మండల బాధ్యులు బి .శ్రీనివాసరావు, కాశెట్టి శ్రీనివాస్ , కనపర్తి సంతోష్, కాశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు