విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యత ఎన్నికల పై అవగాహన..

జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ లో.


J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణం లో జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ లో ఓటు యొక్క ప్రాముఖ్యత మరియు ఎన్నికల పైన అవగాహన కల్పించడానికి విద్యార్థుల కు గురువారం స్టూడెంట్స్ రిప్రజెంటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.
పాఠశాల స్థాయి నుండి మంచి పౌరులుగా మరియు వారి బాధ్యతలను ఎలా నిర్వహించాలో తెలపడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

సాధారణ ఎన్నికల మాదిరి గానే వివిధ విభాగాలకు నామినేషన్లు స్వీకరించి, ఇతర విద్యార్థులను తమకు అనుకూలంగా ఓటు వేయమని అభ్యర్థించడానికి అవకాశం కల్పించారు. ఈ ఎన్నిక ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను, వారి ప్రతిభ ను పెంపొదించడానికి అవకాశం కల్పించారు. ప్రచారం ద్వారా వారు తమను తాము ఎలా వ్యక్తీకరించాలో నేర్చుకున్నారు., వారికి అవసరమైన వ్యూహాలను మరియు నైపుణ్యాలను సంపాదించారు.

ఈ ఎన్నిక కు పోలింగ్ అధికారులు గా పాఠశాల ఉపాద్యాయలు వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బీయ్యల హారి చరణ్ రావు ఫలితాలని ప్రకటించారు
చీఫ్ ప్రిఫెక్ట్ A. అభినవ్( IX CLASS) , M. సాధ్వి (IX CLASS) డిప్యూటీ చీఫ్ ప్రీఫెక్ట్ యశ్వంత్ (IX CLASS ) , నిధా ఆఫ్సిన్ ( IX CLASS ) మరియు స్పోర్ట్స్ సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ డిసిప్లిన్ సెక్రటరీ, ప్రేయర్ కో ఆర్డనేటర్ లుగా గెలుపొందిన విద్యార్థులకు బ్యాడ్జ్, లెటర్ ఫర్ అప్రూవల్ అందచేశారు.


ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బియ్యల హరి చరణ్ రావు మాట్లడుతూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాది, ఒక దేశ , రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది, భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా పౌరులందరికీ ఓటు హక్కును కల్పిస్తుంది, ఒక ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయబడుతుంది, అలాగే జనవరి 25 న ఓటర్ దినోత్సవం గా జరుపుకుంటారని ఓటు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు .ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థులను అభినందించారు,
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరి చరణ్ రావు , శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత రావు పాల్గొన్నారు.