వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక సందర్శన..

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతి వార్డు తిరిగి గర్భిణీలతో, వారి అటెండ్లతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను తెలుసుకున్నారు.

ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, మందులు సక్రమంగా అందుతున్నాయా, వైద్యం బాగుందా లేదా అన్న వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం కాబట్టి మీరు ఇచ్చే సమాధానం నాకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.
పిల్లల ఇన్ పేషెంట్ వార్డుని సందర్శించిన మంత్రి అందులో అడ్మిట్ అయిన పిల్లలను పరామర్శించారు.

వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వమే అన్ని రకాల మందులతోపాటు టెస్టులను కూడా చేస్తుందని బయట ప్రైవేటులో చేయించుకోవద్దని మంత్రి వారి తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం వైద్యుల హాజరు పట్టికను తనిఖీ చేసి సూపరింటెండెంట్, వైద్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ కూడా ఉన్నారు.


డాక్టర్లు విధులు నిర్వహించే తొమ్మిది నుండి నాలుగు గంటల సమయం వరకు విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపర్డెంట్ లకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అనధికారికంగా లీవులు పెట్టిన వారిని మందలించి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు
.