J.SURENDER KUMAR.
రాష్ట్రంలో ANM లను అందరినీ ఎటువంటి షరతులు లేకుండా, పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లక్ష్మణ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద AITUC ఆద్వర్యంలో ANM, ఉద్యోగస్తులు చేపట్టిన నిరవధిక సమ్మెలో మంగళవారం అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తాటిపర్తి విజయ లక్ష్మి , పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన MPHW (F) నోటిఫికేషన్ 2/2023 ని వెంటనే రద్దు చేయాలని, ఔట్ సోర్సింగ్ ANM లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

పర్మినెంట్ చేయాలి !
విద్యాశాఖ సమగ్ర శిక్షా నందు ఒప్పంద ప్రాతిపాదికన పని చేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని లక్ష్మణ్ కుమార్, విజయలక్ష్మి డిమాండ్ చేశారు
విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కెసీఆర్ , జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, మరియు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు పైన ఉందని, ఉద్యోగులు గత మూడు రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేపట్టి నిరసన తెలియజేస్తుంటే ఒక్క అధికారి కూడా వారి దగ్గరకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకోకపోవడం చాలా బాధాకరమని, వారు అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వములో ప్రభుత్వం దృష్టికి డిమాండ్లను తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగస్తుల సమస్యలన్ని పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, గొల్లపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ అధికార ప్రతినిధి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు..