ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం !
J.SURENDER KUMAR,
తెలంగాణా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్ట్, ab6 News చీఫ్ ఎడిటర్ విష్ణుదాస్ శ్రీకాంత్ ను నియమిస్తూ
మంగళవారం ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శ్రీమతి శాంత కుమారి జీవో నెంబర్1205 ను జారి చేసింది.

బ్రాహ్మణ పరిషత్ లో సేవ చేసే భాగ్యం కల్పిస్తూ సభ్యుడి గా నియమించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ సలహాదారులు, పరిషత్ చైర్మన్ , గురువర్యులు డాక్టర్ కెవి రమణచారి కి విష్ణు దాస్ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. విష్ణు సహస్ర శ్రీకాంత్ నియామకం పట్ల పలు జిల్లాల బ్రాహ్మణ సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.