J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై లోకాయుక్త (కోర్టు) లో సెప్టెంబర్ 6న విచారణ జరుగనుంది. జిల్లా ఉన్నతాధికారులు 32 పేజీలతో కూడిన 18 షీట్ల నివేదికను లోకాయుక్త రిజిస్ట్రార్ కు అందజేశారు. అట్టి నివేదిక ను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే తెలుపాలని పిర్యాదుదారుడు చుక్క గంగారెడ్డి కి లోకాయుక్త రిజిస్ట్రార్ సూచించారు.
బుగ్గారం గ్రామ పంచాయతీ లో నిధుల దుర్వినియోగం జరిగిందని చుక్క గంగారెడ్డి 2022 సెప్టెంబర్ 21న జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులపై ఆయన లోకాయుక్త రిజిస్ట్రార్ కు పిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న విచారణ జరుగునున్నది.