కోర్టు తీర్పులు ప్రతికూలంగా వస్తే..
ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు ఎవరు ?

J.SURENDER KUMAR.

సీఎం కేసీఆర్ అంటేనే ఓ సంచలనం, రాజకీయ ఎత్తులు, పైఎత్తులలో ఆయనకు ఆయనే సాటి ఆయనకు లేరు పోటీ, అనేది రాజకీయ రంగంలో జగమెరిగిన సత్యం. అయితే సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులలో కొందరి గెలుపు పై కోర్టులలో విచారణ జరుగుతున్నది. వారి పై కోర్టు తీర్పులు ప్రతికూలంగా వస్తే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు ఎవరు ? అనే చర్చ నెలకొంది.

ఎపిసోడ్ లోకి వెళితే..

ఈ సంవత్సరం డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేయనున్న అభ్యర్థులు 114 మంది పేర్లను సీఎం కేసీఆర్ ముందస్తుగా ప్రకటించి సంచలనం సృష్టించడంతోపాటు ఆయా రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. టిఆర్ఎస్ టికెట్ ఆశించి, రాని వారి అలకలు, ఆందోళనలు, ఆ పార్టీ పై దుమ్మెత్తి పోయడం, పార్టీ ఫిరాయింపులు రాజకీయాలలో షరా మామూలే.

కోర్టు విచారణలో ఉన్నవి మచ్చుకు….

👉 2018 ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పై స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచి వనమా వెంకటేశ్వరరావు అధికార పార్టీలో చేరారు. 2018 లో ఓటమి పొందిన జలగం వెంకట్రావు హైకోర్టు లో వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదు అంటూ పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు కేసు పూర్వపరాలు విచారించి. గత నెల జూలై మాసంలో వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ, జలగం వెంకట్రావు ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా 2018 డిసెంబర్ 12 నుంచి కొనసాగుతారని తీర్పునిస్తూ వనమా వెంకటేశ్వరరావు పై కోర్టు అనర్హత వేటు వేసింది. ఈ నేపథ్యంలో వనమా తిరిగి హైకోర్టును కోర్టు నాశ్రయించినా అతడి పిటిషన్ కొట్టి వేసిన విషయం విధితమే. దీంతో వనమా ఈనెల మొదటి వారంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రత్యర్థులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా అంటే సెప్టెంబర్ మొదటి వారంలో విచారణ పూర్తి కానున్నది.
సీఎం కేసీఆర్ ప్రకటించిన 114 అభ్యర్థులలో కొత్తగూడెం స్థానంలో వనమా వెంకటేశ్వరరావు కు టికెట్టు కేటాయించారు. సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు కు తీర్పు ప్రతికూలంగా వస్తే. ఆ స్థానంలో అభ్యర్థి ఎవరు ? అనేది చర్చ.

👉 జోగులాంబ జిల్లా గద్వాల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అధికార పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి మాజీమంత్రి డీకే అరుణ పై విజయం సాధించారు. ఎన్నికల అఫిడవేట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంట ప్రత్యర్థి అభ్యర్థిని డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ వేసారు. గురువారం న్యాయమూర్తులు కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ. 2018 డిసెంబర్ 12 నుంచి డీకే అరుణ ను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పు ఇవ్వడంతో పాటు. కృష్ణమోహన్ రెడ్డికి ₹ 2.50 లక్షల జరిమానా విధించడంతోపాటు డీకే అరుణకు 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. కెసిఆర్ ప్రకటించిన అభ్యర్థులలో ఇతడి పేరు సైతం ఉంది.

👉 ధర్మపురి నియోజకవర్గానికి చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ తాను గెలిచానని, ఓట్ల లెక్కింపులో. అధికారులు అవకతవకలకు పాల్పడ్డారంటూ 2019 లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టులో తరచూ విచారణ జరుగుతోంది. 2018 ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ తాళాలు, తప్పిపోయాయి. తాళాలు పగలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ దశలో కొనసాగుతున్నది.
114 మంది జాబితాలో ఈశ్వర్ పేరు కూడా ఉంది.

👉 కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌పై దాఖలైన ఎన్నికల పిటిషన్‌లో తాజాగా రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, పిటిషనర్ బండి సంజయ్ నుంచి హైకోర్టు సాక్ష్యం తీసుకుంది. దీనికి తోడు కోదాడ, దేవరకొండ, ఆలేరు, జనగామ, నాగర్ కర్నూల్ తదితర మరో 10 అసెంబ్లీ సెగ్మెంట్ ల లో టిఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల వివాదం కోర్టులో కొనసాగుతున్నది త్వరలో న్యాయస్థానాలు తీర్పుల ను ప్రకటించవచ్చని ప్రత్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రకటించిన 114 అభ్యర్థుల వీరి పేర్లు ఉన్నాయి.

తీర్పు రాకముందే టికెట్టు తిరస్కరించారు !

👉 వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం పై సుదీర్ఘంగా విచారణ కొనసాగుతున్నది. కాంగ్రెస్‌కు చెందిన ఆది శ్రీనివాస్‌ దాఖలు చేసిన పౌరసత్వ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఐదు నెలల క్రితం ఉత్తర్వులను రిజర్వ్‌ చేసింది. 2010 నుంచి కేసు నడుస్తోంది. శుక్రవారం నాటి వరకు ఎలాంటి తీర్పు వెలువడ లేదు. ఆయన సీఎం కేసీఆర్ పౌరసత్వ వివాద అంశం మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రొఫెసర్ చెన్నమనేని రమేష్ బాబు కు. టికెట్టు నిరాకరించడం ప్రస్తావనారం.
పౌరసత్వం వివాదంలో రమేష్ బాబుకు కోర్టులో ప్రతికూలంగా తీర్పు వచ్చిన. రాజ్యాంగ ధర్మాసనంతో పాటు. రమేష్ బాబు రాష్ట్రపతికి తన పౌరసత్వ అంశంపై ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందనే చర్చ జరుగుతున్నది.