డిగ్రీ విద్యార్థిని అదృశ్యం..

ధర్మపురి పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు ?

J.SURENDER KUMAR,

ధర్మపురి మండలం ఓ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని హైదరాబాదులో గత నెల చివరి వారంలో అదృశ్యం అయింది. విద్యార్థిని తల్లిదండ్రులు తన కూతురు అదృశ్యం పై గురువారం ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శివారు ఘట్కేసర్ ప్రాంతంలో ఓ కళాశాలలో విద్యార్థినీ డిగ్రీ చదువుతోంది. గత నెల చివరి వారంలో కళాశాల నుంచి బయటికి వెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు చేరుకోలేదు. తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం లేదు. అయితే అదృశ్యమైన కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఓ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను అంటూ సమాచారం ఇచ్చిందనే చర్చ ఆ గ్రామంలో జరుగుతుంది. విద్యార్థినిపై తల్లిదండ్రులు ఫోన్ చేసిన సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే గత 25 రోజులుగా కూతురి ఫోన్ స్విచాఫ్ ఉండడంతో. నిరక్షరాస్యులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే తల్లిదండ్రులు భయాందోళన చెందుతూ కూతురు ఆచూకీ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.