ధర్మపురి క్షేత్రంలో రేపటి నుండి శ్రావణ మాస సందడి ఆరంభం..

నెల రోజులపాటు, సెప్టెంబర్ 16 వరకు

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో, గురువారం నుంచి శ్రావణమాస సందడి ప్రారంభం కానున్నది. గోదావరి నదిలో భక్తుల పవిత్ర స్నానాలు, సోమ మంగళ, శుక్ర, శనివారాలు తో పాటు నెలరోజుల గా క్షేత్రంలో భక్తజనం ఆలయల దర్శనాలతో ఏనలేని సందడి ఏర్పడనున్నది.

శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంతో పాటు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ ఈశాన్య గణపతి, శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి, శ్రీ గౌతమేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సీత రామచంద్ర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ సంతోషిమాత, మార్కండేయ స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ మహాలక్ష్మి, శ్రీ దుర్గా దేవి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, ఆలయాలతో పాటు, స్థానిక వీధులలో గల శివ పంచాయతనాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాల, వేదమంత్రాల, మంగళ వాయిద్యాలు, భజనల ఘోషలతో క్షేత్రం భక్తి పారవశ్యంతో వీధులు ప్రతిధ్వనిస్తాయి. శ్రావణమాస రుద్రాభిషేకాలు, మంగళ గౌరీ వ్రతాల తో క్షేత్రం భక్తి పార్యవశంతో పరవశంతో ఓలలాడుతుంది. గురువారం నుంచి సెప్టెంబర్ 16 వరకు శ్రావణ మాసం సందడి కొనసాగుతుంది.

👉ఆలయంలో ప్రత్యేక పూజ వివరాలు!

శ్రావణమాసం సందర్భముగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి నెల రోజులపాటు ప్రత్యేక అభిషేకలు, ప్రత్యేక పూజలు ₹ 2516/-లు చెల్లించిన భక్తుల గోత్రనామాలతో నెల రోజుల పాటు అభిషేకము, పూజలు, అర్చకులు జరుపుతారు.
👉 అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్రనర్సింహస్వామి వారి ఆలయంలో ₹ 2000/-లు చెల్లించిన భక్తుల పేరున నెల రోజుల పాటు అభిషేకము, భోగములు, సంకల్పము నిర్వహించబడును.
👉 శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయము (శివాలయం ) ₹ 516/-లు చెల్లించిన భక్తుల పేరున నెల రోజుల పాటు అభిషేకము నిర్వహించబడును అని, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. స్థానికి ఆర్యవైశ్య సంఘం, ఆధ్వర్యంలో శ్రావణమాసంతం వరకు నిత్యం రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీస్వామి వారి సన్నిధిలో భజన కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు.