J.SURENDER KUMAR.
జగిత్యాల్ ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యం కు కరీంనగర్ జిల్లా వినియోగదారుల ఫోరం వినియోగదారుడికి ₹50, వేలు జరిమాన చెల్లించాలని, అధికంగా వసూలు చేసిన ₹ 92 వేలు తిరిగి ఇచ్చివేయాలని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాలకి చెందిన ఎస్వీ ప్రసాద్ ఎల్ఐసి ఉద్యోగి, ఇంటి నిర్మాణ నిమిత్తం స్థానిక ఆంధ్ర బ్యాంకులో ₹ 10 లక్షల రూపాయలను 2006 . రుణము తీసుకున్నాడు.. ప్రతి కిస్తూ ₹ 9,703/- చొప్పున 180 వాయిదాలలో చెల్లించాలి. సక్రమంగా 11. సంవత్సరాల పాటు చెల్లిస్తూనే ఉన్నాడు. ఒకేసారి బ్యాంక్ అధికారులు ప్రతి కిస్తీని.₹ 21,476/- చొప్పున చెల్లించాలి అంటూ వేధింపులు ప్రారంభించారు.

దీంతో వినియోగదారుడు తాను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను మొదట ఒప్పందం ప్రకారం ₹ 9,703/- చెల్లిస్తానంటూ బ్యాంక్ అధికారులను ప్రాధేయపడిన వారు ఒప్పుకోలేదు.
పైగా ప్రాపర్టీ రికవరీ నోటీసులు జారీ చేయడం. పత్రికలలో ఆస్తి వేలం ప్రకటన జారీ చేయడం తదితర విధాలుగా వినియోగదారుడి నీ వేధింపులకు గురి చేశారు.
దీంతో వినియోగదారుడు ప్రసాద్, జగిత్యాలకు చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

కేసు పూర్వకరాలు పరిశీలించిన న్యాయమూర్తులు. మానసిక వేదనకు, పరువుకు నష్టం కలిగించిన బ్యాంక్ యాజమాన్యం. వినియోగదారుడికి ₹ 50 వేల రూపాయల నష్టపరిహారం, ఖర్చులు నిమిత్తం మరో ₹ 5 వేలు చెల్లించాలని, అధికంగా వసూలు చేసిన ₹ 92, వేల రూపాయలు వినియోగదారుడి ఖాతాలో జమ చేయాలని. లేనిపక్షంలో ఫోరమును ఆశ్రయించిన తేదీ నుంచి 9% వడ్డీతో చెల్లించాలని. అధ్యక్షురాలు K. స్వరూప రాణి, సభ్యులు S. శ్రీలత, V . వీ నరసింహారావు లు ఆదేశాలు జారీ చేశారు.