జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్న సెంట్రల్ టీమ్ 17 మంది సభ్యులు బృందం !

👉 గ్రామపంచాయతీ అభివృద్ధిపై ఫౌండేషన్ ట్రైనింగ్!


👉 విద్యా, వైద్యం, ఆరోగ్యం ,అగ్రికల్చర్, కల్చరల్ యాక్టివిటీస్ వీటిపై అవగాహన!


J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలు ఏర్పడిన కొత్తగా కలెక్టర్ కార్యాలయాలు నిర్మించుకుని ప్రజలకు అత్యంత చేరువలో ప్రభుత్వ పథకాలు చేరవేసేందుకు జిల్లా పాలన యంత్రాంగం
విశేష కృషి చేస్తుందని అభివృద్ధి సంక్షేమలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తుందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ టీం వారికి వివరించారు.

సోమవారం రోజున జగిత్యాల జిల్లాలో 05 రోజులు పర్యటిస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ( సెంట్రల్ టీమ్) మొత్తం బృందంలో 17 మంది సభ్యులు గ్రామపంచాయతీ అభివృద్ధిపై ఫౌండేషన్ ట్రైనింగ్ కొరకు జిల్లాకు విచ్చేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ ను కలిసి సమావేశం అయ్యారు.
గ్రామపంచాయతీ మల్యాల మండలం ముత్యంపేట, గొల్లపల్లి మండలం తిరుమలాపూర్, రాయికల్ మండలం ఇటికల్, కోరుట్ల మండలం నాగులపేట గ్రామాలలో ఈ బృందం పర్యటించి గ్రామపంచాయతీ అభివృద్ధిపై ఫౌండేషన్ అవగాహన పెంపొందించుకుంటారు
జగిత్యాల జిల్లా పరిపాలన సంబంధించిన అంశాలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై సెంట్రల్ టీం సభ్యులకు కలెక్టర్ వివరిస్తూ కలెక్టర్ కార్యాలయం ఏర్పడక ముందు వివిధ శాఖలు జిల్లాలో వివిధ చోట్ల ఉండి ప్రజలు వారి సమస్యలు పరిష్కారానికి ఇబ్బందులు పడే వారిని నూతన కలెక్టరేట్లు నిర్మాణం జరిగి అన్ని శాఖలను కలెక్టరేట్లలో ఉండేటట్లు చూడడం వల్ల ప్రజా సౌకర్యాలు మెరుగుపడి వారి సమస్యలు పరిష్కారం సులభతరం అయిందని చెప్పారు. ఇదంతా తెలంగాణ రాష్ట్ర గొప్పతనంగా వివరించారు. ఫైనాన్స్, పవర్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ అంశాలలో జగిత్యాల జిల్లా ముందంజలో ఉందన్నారు.


తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని వివరించారు. ప్రతి మండలానికి పంచాయతీ కార్యదర్శులను నియమించుకొని గ్రామంలో ఉన్న మౌలిక వసతులపై ప్రజల సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇరిగేషన్ చాలా బాగు పడిందని ప్రాజెక్టులు కాలేశ్వరం ఎస్సారెస్పీ, శ్రీరాంసాగర్, ఉన్నాయన్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా మండలానికి వ్యవసాయ విస్తరణ అధికారి నియమించి పంట సాగులపై రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక దిగుబడిన సాగించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. రైతుబంధు రైతు బీమా ద్వారా రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నామని చెప్పారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఉన్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో జిల్లాస్థాయి గ్రామస్థాయిలో విజయవంతంగా నిర్వహించామని వివరించారు. అనంతరం సెంట్రల్ టీం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ డి ఆర్ డి ఏ పి డి నరేష్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.