👉 ₹ 1లక్ష విలువ ఆస్తి నష్టం కు అదనంగా ₹ 3 లక్షల నష్టపరిహారం !
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ !
J. SURENDER KUMAR.
దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉంటూ వస్తున్న యావర్ రోడ్డు విస్తరణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీ వో జారీ చేసిందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.,
ఒక లక్ష ఆస్తి నష్టానికి అదనంగా మరో మూడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాకు జీవో ప్రతిని విడుదల చేశారు.

హైదరాబాద్ వంటి నగరాల్లోనే ఈ తరహా జీవో తో నష్టపోయె ఇంటి యజమానులకు ఒక లక్షకు అదనంగా మరో మూడు లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తారన్నారు.
ఈ పత్యేక జీఓ ను కేవలం జగిత్యాల పట్టణానికే ప్రభుత్వం జారీ చేసిందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు
కొత్త బస్ స్టాండ్ నుంచి ధర్మపురి రోడ్డు వరకు రోడ్డు విస్తరణం లో నష్టపోయే ఇంటి యజమానుల కు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్డు విస్తరణలో 284 ప్రైవేట్ భవనాలు ఉన్నా, వీరందరికి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తే విస్తరణకు అనుమతికి వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
టి.డి.ఆర్ పద్దతిలో నష్టపోతున్న ఇంటి యజమానులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారని అలాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు 284 ప్రైవేటు భవనాల పూర్తి వివరాలను వైబ్ సైట్ లో అప్లోడ్ చేస్తారని ఎమ్మెల్యే పేర్కోన్నారు.
ఈ జీవోద్వారా యావర్ రోడ్డు విస్తరణ పనులకు ఆటంకాలు తొలిగిపోయాయని అన్నారు.
ఈ జీవో జారికి కృషిచేసిన మంత్రి కేటిఆర్, ప్రణాళిక సంఘం సభ్యులు వినోదకుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.