👉 హెచ్ఐవి పాజిటివ్ ఉందని తప్పుడు రిపోర్ట్ !
👉 బాధితుడికి ₹ 2 లక్షల చెల్లించాలని ఫోరం ఆదేశం!
J.SURENDER KUMAR.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కు చెందిన వ్యక్తికి వైద్య పరీక్షలలో హెచ్ఐవి పాజిటివ్ ఉందని తప్పుడు నివేదిక ఇచ్చిన కరీంనగర్ అపోలో రీచ్ ఆసుపత్రికి జిల్లా వినియోగదారుల ఫోరం ₹ 2 లక్షల రూపాయలు బాధితుడికి చెల్లించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో ₹ 5 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

వివరాలు ఇలా ఉన్నాయి.
మల్యాల మండలం కు చెందిన మనోజ్ ( పేరు మార్చాము ) కడుపునొప్పితో బాధపడుతూ కరీంనగర్ అపోలో రిచ్ ఆసుపత్రికి 1-09-210 న వైద్యం కోసం వెళ్ళాడు. వైద్యులు శస్త్రచికిత్స చేయాలని, రక్త పరీక్షలు నిర్వహించారు. నీకు హెచ్ఐవి పాజిటివ్ ఉంది అంటూ శస్త్ర చికిత్స చేయలేము అని ఆస్పత్రి నుంచి బలవంతంగా బయటికి పంపించారు. దీంతో బాధితుడు జగిత్యాల్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ICTC లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వైద్య పరీక్షల నివేదికలో ఎలాంటి హెచ్ఐవి పాజిటివ్ లక్షణాలు లేవని, నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. తనకు హెచ్ఐవి పాజిటివ్ ఉందని తీవ్ర మానసిక వేదనకు గురి చేయడంతో, పాటు బందు వర్గంలోను స్వేచ్ఛగా వారు, నేను, తిరగలేని పరిస్థితి నెలకొంది అని బాధితుడు అపోలో రీచ్ ఆసుపత్రి పై జగిత్యాల కు చెందిన ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ద్వారా జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.

కేసు పూర్వపరాలు, వాదనలు పరిశీలించిన వినియోగదారుల ఫోరం ఆస్పత్రి యాజమాన్యం, బాధితుడికి ₹ 2 లక్షల రూపాయల జరిమానాను తేది 22-11-2011 నుండి 9% వడ్డీతో కలిపి చెల్లించాలని, ఖర్చుల నిమిత్తం మరో ₹ 5 వేలు ఇవ్వాలని ఫోరం అధ్యక్షురాలు K. స్వరూపారాణి, సభ్యులు S. శ్రీలత , V. నరసింహారావు ఆదేశిస్తూ తీర్పునిచ్చారు.