మంత్రి కొప్పుల ఈశ్వర్ MLA పదవికి రాజీనామా చేయాలి !

BJP ఎస్సీ మోర్చా కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్

J.SURENDER KUMAR.

M.I. M గుండాల అరాచకాల కారణంగా హైదరాబాద్ లో ఆత్మహత్య కు పాల్పడిన దళిత యువకుడు సోలంకి విజయ్ విషయంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించకపోవడం బాధాకరమని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓరగంటి చంద్రశేఖర్ అన్నారు.

ధర్మపురి పట్టణంలోని కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీజేపీ యస్సిమోర్చా నాయకులు దొనకొండ నరేష్,కడారి గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ మాట్లాడుతూ
రాజులు మారిన, రాష్ట్రాలు మారిన దళితుల పై దాడులు, హత్యలు, అత్యాచారాలు మాత్రం ఆగటం లేదనడానికి హైదరాబాద్ కి చెందిన దళిత యువకుడు సోలంకి విజయ్ ఆత్మహత్య నే నిదర్శనమన్నారు. విజయ్ భార్యపై M.I.M గుండాలు అసభ్యంగా ప్రవర్తించిన విషయంలో మలక్ పేట పోలీసులు, B.R.S ప్రభుత్వ ఒత్తిడితో కనీసం కేసు నమోదు చేయకపోవడమే విజయ్ ఆత్మహత్యకు కారణమన్నారు.
M.I.M, B.R. S రెండు ఫ్రెండ్లీ పార్టీలు అని కెసీర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, దళితులపై M.I. M గుండాలు దాడులు చేస్తే ప్రభుత్వం స్పందించకపోవడం దళితులపై KCR మరియు ఆయన ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమన్నారు.


రాష్ట్రంలో టేకు లక్ష్మి, బిగారి నర్సింహులు, వికారబాద్ నాగరాజు, నేడు సోలంకి విజయ్ ఇలా చెప్తుపోతే అనేకమంది దళితులపై B.R.S, M.I. M మరియు హిందూయేతర శక్తులు దాడులు చేస్తే దళిత సమాజం నుండి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కొప్పుల ఈశ్వర్ కనీసం స్పందించకపోవటం బాధాకరమన్నారు.
దళితుల సమస్యలు ఎత్తిచూపని ఈశ్వర్ దళితులపై దాడులు జరుగుతుంటే స్పందించని మంత్రి ఈశ్వర్ తన MLA పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మృతుడు విజయ్ కుటుంబానికి నష్ట పరిహారం కింద ₹ 50 లక్షలు,డబల్ బెడ్రూం ఇల్లు తో, పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యొగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయ్ ఆత్మహత్యకు కారణమైన MIM గుండా ఫారూఖ్, మరియు అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో..పట్టణ బీజేపీ అద్యక్షులు బెజ్జరపు లవన్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలమసు వైకుంఠం, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బండారు లక్ష్మణ్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి ఆకులు శ్రీనివాస్, BJYM పట్టణ అద్యక్షులు గాజు భాస్కర్, కిసాన్ మోర్చా మండల అద్యక్షులు కుమ్మరి తిరుపతి, ప్రధాన కార్యదర్శి కడగంటి కిరణ్, బాకీ రాజేష్, బాకీ అనిల్, అన్నందస్ నవీన్, మహిపాల్
సీనియర్ నాయకులు తిరమందాస్ సత్యనారాయణ, కస్తూరి రాజన్న, పొగుల గుండయ్యా, పల్లెర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.