ఒడ్డేరల కు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించాలి.!

కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగపేట ఒడ్డెర కాలనీవాసులు !

ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR.

బలహీన వర్గాలకు చెందిన వడ్డెరలకు రాజ్యాధికారం లో కూడా హక్కు కల్పించాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మంగళవారం సారంగా పూర్ మండలం రంగ పేట ఒడ్డెర కాలనీకి చెందిన లవన్, నరేష్ ఆధ్వర్యంలో ఒడ్డేర యువకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
శ్రమకు ప్రతిరూపం ఒడ్డే ర కులస్తులనీ,
భవన నిర్మాణ రంగంలో ఓడ్డెరలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
కేసిఆర్ పాలనలో బలహీన వర్గాలకు ప్రాధాన్యం లేదు.ఒడ్డేరలను గిరిజనుల్లో కలుపాలని అంశం కనుమరుగు అయింది .
సీఎం కెసిఆర్ ఒడ్డేర కులస్థులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో చెప్పాలన్నారు .. ఒడ్డేర కార్పోరేషన్ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అయినా ఒక్క రూపాయి కేటాయించలేదు..
కనీసం ఒడ్డేర కార్పొరేషన్ కు చైర్మన్ కూడా నియమించలేదు..
బలహీన వర్గాలను చిన్నచుపు చూస్తున్న సీఎం ఒక్క కెసిఆర్ మినహా దేశంలో ఎవరు లేరు..
ఇళ్లు కట్టుకునేందుకు బండ రాయి తీసుకున్న కేసులు పెడుతున్నారు..
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, దండుగుల లవన్, బొదాసు నరేష్, పల్లపు నరేష్, శివరాత్రి నిమేష్, దండుగుల నర్సులు, దండుగుల అరుణ్, పల్లపు శ్రీనివాస్, ఎంపి టీ సీ మాలేపు విమలసుధాకర్, ఉప సర్పంచ్ రామడుగు రవి, మాజీ ఎంపి టీ సీ కొత్త రవీందర్, దండుగుల సురేష్, కిషన్, బోదాసు గణేష్, పోగుల శంకర్, అల్లేపు రాజలింగం,పల్లపు నర్సింగం, అల్లెపు రమేష్, పల్లపు నాంపెల్లి,బుచ్చిరెడ్డి, బొదాసు కాపు, మల్లేష్, నర్సారెడ్డి, పోగుల కిష్టయ్య, ఎల్లారెడ్డి, నవీన్, గుర్రం ప్రసాద్, రాయికంటి చిన్న ఎల్లయ్య, పిసిసి ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు గిరినాగభూషణం, రఘువీర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, దయాల శంకర్, పులి రాము, నిశంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, లై సేట్టి విజయ్, రియాజ్ తదితరులు. పాల్గొన్నారు.