పేద ప్రజల పిల్లలకు విద్యను అందించాడం కోసమే ఈ మన ఊరు మన బడి !

మంత్రి కొప్పుల ఈశ్వర్..


J.SURENDER KUMAR,

గ్రామాల్లో నిరుపేద ప్రజల పిల్లలకు విద్యను అందించాడం కోసమే ఈ మన ఊరు మన బడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అనీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల నందిమేడారం నల్లలింగయ్య పల్లె లో ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ₹ 13 లక్షల 6 వేల నిధులతో మౌళిక సదుపాయాల అభివృద్ది పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 274 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది,
ధర్మపురి నియోజకవర్గంలో మన ఊరు మన బడి క్రింద 91 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశామన్నారు.


తొలి విడతలో ₹ 3,497.62 కోట్లతో 9,123 స్కూళ్లను 12 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
నంది మేడారం గ్రామంలో కనివిని ఎరుగని విధంగా అభివృద్ది చేయడం జరిగింది, 50 పడకల ఆసుపత్రి నిర్మాణం అనేది ఒక వరం, ఇది ప్రజలు గమనించాలి, అంతేకాకుండా డబుల్ రోడ్డు, కులసంఘ భవనాల నిర్మాణం, దాదాపు 80 శాతం రోడ్లు పూర్తి చేయడం జరిగింది, తెనుగు వాడలో గత సంవత్సరం వందలతో నీరు ఇండ్లలోకి వరదనీరు రావడం, దీనికి ప్రత్యమ్నాయం ₹ 3 కోట్ల 6 లక్షల తో సైడ్ డ్రైన్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు
విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది
రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్‌ లను పంపిణీ చేయడం జరిగింది,
30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నాం అని మంత్రి అన్నారు.
ధర్మపురి నియోజకవర్గం లో మన ఊరు మన బడి ద్వారా 91 పాఠశాలు ఎంపిక కావడం జరిగింది అన్నారు.
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా మంచి ఫలితాలు సాధించారని, పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చే దిశగా మన ఊరు మన బడి కార్యక్రమాన్ని సీఎం రూపొందించారు అని మంత్రి వివరించారు.