ప్రణాళిక బద్ధంగా జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు  జరగాలి!

అదనపు కలెక్టర్  బిఎస్.లత

J.SURENDER KUMAR,

ఈ నెల  15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు పక్కగా ఉండాలని  జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్, బిఎస్ లత అన్నారు.
జిల్లా లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు వివిధ  శాఖల  ద్వారా చేపట్టాలిసిన కార్యక్రమాల గుర్చి  జిల్లా స్థాయి అధికారులతో  అదనపు కలెక్టర్   సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ… స్థానిక   ఖిలా  ఆవరణలో జరగనున్న వేడుకలకు సంబందించి పరేడ్, బందోబస్తు, బారికేడింగ్, గౌరవ  వందనం తదితర  ఏర్పాట్ల ను పోలీస్ శాఖ  చేయాలన్నారు.
గ్రౌండ్ క్లీనింగ్, వేదిక  అలంకరణ, తాగు నీటి  సౌకర్యం, పారిశుద్ధ  పనులను  సంబంధిత అధికారుల దృష్టి పెట్టాలన్నారు
ఇన్విటేషన్ కార్డ్స్, అవార్డ్స్ సంబంధిత శాఖల వారీగా ఒక్కో శాఖకు ఒక్క ఉద్యోగి మాత్రమే ఉత్తమ సేవల అవార్డు లిస్టు తయారుచేసి ఆయా శాఖలు అందించాలని అన్నారు


ప్రోటో్కాల్, ఇన్విటేషన్ కార్డ్స్ అందరికి  అందేలా చూడడం, వేదిక పైన సీటింగ్, ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు.
దేశభక్తి గీతాల మీద సాంస్కృతిక   ప్రదర్శనలు జిల్లా విద్యాశాఖ అధికారి  ద్వారా నిర్వహించాలని అన్నారు.
వేడుకలకు వచ్చే  ముఖ్య అతిధికి  జిల్లా  ప్రగతి కి సంబందించిన సందేశాన్ని  తయారు చేయాలని, మైక్ సిస్టం ఏర్పాటు డి పి ఆర్ ఓ, సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
వేడుకలకు  వచ్చే  V.VIP, VIP,  ఆఫీసర్స్, ప్రెస్ వాళ్లకు  ముందస్తు జాగ్రత్త లలో భాగంగా ఎటువంటి అసౌకర్యంగా లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
108,102, అంబులెన్స్,  ఫస్ట్ AID కిట్,  మెడికల్ టీమ్ ను  అందుబాటులో ఉంచాలని  DMHO ను అదనపు కలెక్టర్ రెవిన్యూ ఆదేశించారు.ఈ కార్యక్రమం లో  వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.