స్పెషల్ రివిజన్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలి !

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా


J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణంలో ఆదివారం అర్బన్ విద్యానగర్, జూనియర్ కాలేజీ, పురానిపేట ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్ లలో స్పెషల్ సమరై రివిజన్ క్యాంపులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ బిఎల్ఓ లకు పలు సూచనలు చేస్తూ ఇంటింటా సర్వేతో పాటు, మృతిచెందిన వలస వెళ్లిన పేర్లు తొలగించి
అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్‌ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించడం
ఫామ్ 6 ద్వారా చేపట్టే కార్యాచరణ గురించి వివరించారు. ఓటర్ నమోదు తో పాటు ఇతర మార్పులు చేర్పులు కొరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితాలో సవరణలు చేసి నిర్దేశించిన సమయంలోపు తుది జాబితాను ప్రకటిస్తారని అన్నారు.
బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంప్ నిర్వహించే సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు.
ఆగస్టు 26 నుంచి ఆగస్టు 27, సెప్టెంబర్ 2, మరియు 3 తేదీలలో పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకూ అందుబాటులో ఉండి రెండో ఓటర్ జాబితా సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనిల్ ,అర్బన్ తాసిల్దార్ k. వరంధన్ సంబంధిత బిఎల్వోలు పాల్గొన్నారు

.