J.SURENDER KUMAR
ధర్మపురి పట్టణానికి చెందిన రంగు విరించి స్వప్నిక ను బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానించి లక్ష రూపాయలు పారితోషికం అందించారు.
షార్జా లో ఆగస్టు 16 నుండి 21 వరకు జరిగిన ఆసియా యూనివర్సిటీ కప్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్) – 2023 క్యాటగిరిలో బంగారు పతకంను సాధించింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి దేశ, రాష్ట్ర, ధర్మపురి కీర్తి ప్రతిష్టలు విస్తరింప చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
ధర్మపురి మండలం గోదావరి నదిలో బుధవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 80 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీ పై అనేక పథకాలను అమలు చేస్తున్నారని తేలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మత్స్యకారులకు రాయితీపై వాహనాలు, వలలు, తెప్పలు, ఇతర సామాగ్రిని సబ్సిడీ పై అందజేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీలను ఏర్పాటు చేసి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో సొసైటీల్లో ఉన్న మత్స్యకారులకు చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని అన్నారు.

ముందస్తు రాఖి వేడుకలు !
ధర్మపురి పట్టణ కేంద్రంలోని SH గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆడపడుచులు మంత్రి కి రాఖీ ల ను కట్టారు.