యువజన కాంగ్రెస్ పార్టీకి గుండె వంటిది యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో..

డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి గుండె వంటిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో యువత ముందుండి పోరాటం చేసారని, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ అన్నారు.

63 వ జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం ధర్మపురి కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింహారాజు ప్రసాద్, ఆద్వర్యంలో నిర్వహించిన జెండా పండగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
తాను కూడా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుండి జడ్పీ చైర్మన్ గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా, జిల్లా అధ్యక్షుడి స్థాయిలో కొనసాగుతున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు విషయంలో గాని, నిరుద్యోగ భృతి విషయంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, మరియు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్ జోడో : పాద యాత్ర స్ఫూర్తి గా యూత్ కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్ళాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందేని మొగిలి, వెల్గటూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ధర్మపురి టౌన్ , యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి, నియోజకవర్గ అధికార ప్రతినిధి దాసరి పురుషోత్తం, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్, NSUI అధ్యక్షులు అప్పం శ్రవణ్, చిలుముల లక్ష్మన్, పాయిల శ్రీనివాస్, నిరంజన్, గుడ్ల రవి, రాజ్ కుమార్ ఇఫ్తికర్, గణేష్, శ్రీకాంత్, అరవింద్, మధుకర్, రాజేష్, లక్ష్మణ్, ప్రశాంత్, దేవావరం తదితరులు పాల్గొన్నారు

కాలువ గండి పూడ్చండి..


పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర SRSP D 86 కాలువకు పడిన గండి పడిన ప్రదేశాన్ని వెంటనే పూడ్చాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. దాదాపు 18 నెలల క్రితం కాలువకు గండి పడిందని, కాలువ మరమ్మత్తు పనులు వేసవి లో చేయాల్సి ఉంటే, ఆలస్యంగా పనులు ప్రారంభించడం వల్ల రైతులు నష్టపోవాల్సి దుస్థితి కలిగిందన్నారు.
లక్ష్మణ్ కుమార్ వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంధం మహిపాల్, పట్టణ అధ్యక్షులు కరిటి వేణు మాధవ్, సీనియర్ నాయకులు అరిగే లింగయ్య, కాంపెళ్ళి రాజేశం, సోగాల తిరుపతి, మహమ్మద్ ఆశ్రాఫ్, ఈదుల శ్రీనివాస్, మెట్ పెల్లి నరేష్, ఉత్తెం రాజయ్య గౌడ, గోవింద్, తుమ్మ నరేష్, సందేవెని తిరుపతి, దొరిషెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు