‘జహీర్ అలీ ఖాన్ ‘ కు అశ్రు నయనాలతో అంత్యక్రియలు !

J. SURENDER KUMAR,

నిన్న రాత్రి హఠాత్తుగా మృతి చెందిన మానవతావాది, సుప్రసిద్ధ పాత్రికేయులు, సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ కు మంగళవారం అశ్రు నాయనాలతో అంతక్రియలు జరిగాయి.

అంతిమయాత్రలో భారీ సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, తెలంగాణ జనసమితి పార్టీ(టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ.మాజీద్,

హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జె) కార్యదర్శి షౌకత్ హమీద్, మాజీ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, జనం సాక్షి సంపాదకులు రెహ్మాన్ తదితరులు హాజరై జహీర్ అలీ ఖాన్ కు నివాళి అర్పించారు.