J.SURENDER KUMAR,
రాష్ట్రంలో రాబోవు అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు ఐదు జిల్లాలకు చెందిన ఎస్పీలు శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ , జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, నిర్మల్ జిల్లా ఎస్పీ, ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మరియు అంతర్ ర్రాష్ట్ర/ జిల్లాల సరిహద్దు పోలీస్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా చేపట్టాల్సిన కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలపై చర్చించారు.
అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం, ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా, మరియు బందోబస్తు ఏర్పాట్ల గురించి, సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు మరియు ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి, V.V.I.Ps / V.I.Pల కదలికల సమయం లో పరస్పర సమాచార మార్పిడి, మరియు బందోబస్తు ఏర్పాట్లలో సహకారం,

సరిహద్దు ప్రాంతాలలో గత ఎన్నికల సమయాలలో జరిగిన నేరాలు, మరియు శాంతిభద్రతల సమస్యల పై, ఏదైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే సరిహద్దు జిల్లాల మధ్య పోలీసు బలగాలను త్వరితగతిన చేరుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై, గత ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడిన వ్యక్తులను బైండొవర్ చేయడం లో సరిహద్దు జిల్లాల అధికారులు పరస్పర సహకారం ఉండాలన్నారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయం లో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పై చర్చించారు