డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెట్ చేస్తూ కనీస వేతనం, గ్రాట్యుటీ, రిటైర్ బెనిఫిట్స్ తో పాటుగా ప్రమాద భీమా సౌకర్యం కల్పించి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్ల శిబిరాన్ని మంగళవారం సందర్శించి, పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
మంత్రి కొప్పుల ఈశ్వర్, జోక్యం చేసుకొని అంగన్వాడీ ఉద్యోగస్తులను పిలిచి వారితో చర్చలు జరపడం లేదని, అంగన్వాడి ఉద్యోగస్తులతో చర్చలు జరిపి సంబంధిత మంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వారి డిమాండ్లను తీసుకెళ్లి వాటికి పరిష్కారం చూపించల్సిన బాధ్యత మంత్రి పై ఉందని, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతున్నారు తప్ప, ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రతి గ్రామ గ్రామాన తీసుకెళ్తున్న అంగన్వాడి ఉద్యోగులకు మాత్రం పెంచడం లేదని, లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి వారి బాధ్యతలు వేరే వారికి అప్పజెప్పడం బాధాకరమని, వారు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నాయకత్వంలో వారికి అన్ని విధాల అండగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వెల్గాటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, మండల బీసీ సెల్ అధ్యక్షులు ఉదయ్, గ్రామ సర్పంచ్ మురళి, పాత గూడూరు సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ సందీప్, అసెంబ్లీ అధికార ప్రతినిధి విజయ్, గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి, నందయ్య, చంద్రమౌళి, వెంకటేష్, శశి, శ్రీనివాస్, గొల్ల తిరుపతి, జితేందర్, మల్లేష్, హరీష్, అప్సర్,.రవి కుమార్, అజయ్, జితేందర్, వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు

ధర్మపురిలో మహిళ కౌన్సిలర్ల సంఘీభావం !
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెట్ చేస్తూ కనీస వేతనం, గ్రాట్యుటీ, రిటైర్ బెనిఫిట్స్ తో పాటుగా ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ధర్మపురి మున్సిపల్ మహిళ కౌన్సిలర్లు. పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ధర్మపురి లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరానికి
కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్ జక్కు పద్మ, కౌన్సిలర్ సంగనబట్ల సంతోషి, కౌన్సిలర్ గరిగె అరుణ తదితరులు పాల్గొన్నారు.