జగిత్యాల డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR,
అర్హులైన పేదవారికి దళిత బంధు, బీసీ బంధు ఇవ్వకుండా కేవలం బి ఆర్ ఎస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.
మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆయన ఆధ్వర్యంలో నిరసన, రాస్తారోకో చేపట్టారు.
లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిత్యం వహిస్తున్న నియోజక వర్గంలో పేద లైన దళితులు, బీసీ లు కంటికి కనబడుతలేరా ? దళితబంధు, బీసీ బంధు డబ్బులు ఎవరివి కావని, ప్రజల డబ్బని, అలాంటి డబ్బును పారదర్శకంగా ఖర్చు పెట్టకుండా ఇష్టారీతిన వారి నాయకులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, బ్లాక్ – 2 కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గందం మహిపాల్, సీనియర్ నాయకులు రూప్లా నాయక్, కోమటిరెడ్డి దేవేందర్ రెడీ, కాంపెల్లి రాజేశం, మోట పలుకుల సత్యం, మేండే మహేందర్, బద్దం గంగారెడ్డి, ఏదుల్ల అంజయ్య, కాంపెల్లి పోచయ్య, బెల్లాల మల్లయ్య, భూరగడ్డ శంకర్, వేల్పుల శంకర్, వేల్పుల శ్రీనివాస్, బాలు నాయక్, దారవేని సంతోష్, గంగాధర మహేందర్, కాల్వ రవి, గుర్రం రాజేశం, మోతె రవి, బొబ్బిలి రాకేష్, స్వర్గం భుమేష్, సిరికొండ మహేందర్, బెక్కేం అంజయ్య, వడ్లకొండ అంజయ్య, కోమురెల్లారెడ్డి, తుమ్మ నరేష్, నార మహేందర్,.మెట్ పెల్లి నరేష్, నలిమెల రాజిరెడ్డి, కోట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
సోనియా సభను విజయవంతం చేయండి !

ఈ నెల 17 వ తేదీన హైదరాబాద్ లోని తుక్కు గూడలో సోనియా గాంధీ విజయబేరి సభలో ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సమావేశం జరిగింది.
సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతతత్వ పార్టీగా విభజించు పాలించు అన్న విధంగా పరిపాన కొనసాగిచడం జరుగుతుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇస్తు రాష్ర్టంలో అధికారంలో కొనసాగుతున్నదని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జరగడంలేదని, స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఆరోపణలు చేశారు.

ఈ సమావేశంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, గొల్లపెల్లి మండల పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, వెల్గటూర్ మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, పెగడపల్లి మండల పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్, బుగ్గారం మండల పార్టీ ఉపాధ్యక్షుడు నర్స గౌడ్, బతికపల్లి సర్పంచ్ శోభరాణి, సర్పంచ్ సత్యనారాయణ, సర్పంచ్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, వెల్గటూర్ మండల మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, బొంకుర్ ఉప సర్పంచ్ శ్రీధర్, ఉప సర్పంచ్ వెంకటేష్ సీనియర్ నాయకులు అడ్వకేట్ సురేందర్, గొల్లపెల్లి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాద్యక్షులు చిలుముల లక్ష్మణ్, వివిద మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.