అవినీతి పై అర్థనగ్న ప్రదర్శన అంటే అరెస్టు చేస్తారా ?

చుక్క గంగారెడ్డి అరెస్టు అక్రమం !

కాంగ్రెస్, బీఎస్పీ, పౌర హక్కుల నాయకుల ఖండన !

J.SURENDER KUMAR

బుగ్గారం మండల కేంద్ర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ తీరు, చర్యలు జాప్యంపై పట్ల నిరసనగా అర్థ నగ్న ప్రదర్శన చేస్తా అంటే అరెస్టు చేస్తారా ? అంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ,బహుజన సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.


వివరాలు ఇలా ఉన్నాయి.
బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం పై తక్షణమే విచారణ జరిపిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం  అర్ధనగ్న ప్రదర్శన ద్వారా  జిల్లా కలెక్టరెట్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో  పిర్యాదు చెయ్యడానికి వెళ్తున్న చుక్క గంగారెడ్డి నీ బుగ్గారం పోలీస్ లు అదుపులో. తీసుకొని సాయంత్రం విడిచిపెట్టారు. 

డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , BSP ఇంచార్జ్ నక్క విజయ్ కుమార్  పోలీస్ స్టేషన్లో గంగారెడ్డిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
బుగ్గారం గ్రామ పంచాయతీకి సంబందించి పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి సంబందించిన పిర్యాదుల పై వాస్తవాలు బయటకి వచ్చిన బాధ్యులపై  చర్యలు తీసుకునే విధంగా స్థానికంగా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్  ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదని ? ధర్మపురి నియోజకవర్గంలో రాచరిక పాలన నడుస్తుందని, ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, అడ్డు చెప్పిన వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని వారు పలు ఆరోపణలు చేశారు. పోలీసుల చర్యలు ఖండిస్తూ పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ , నాయకులు మదన కుమార్ స్వామి, సుచరిత తదితరులు ఖండించారు. కాంగ్రెస్ నాయకులు నరస గౌడ్, రంజిత్, అంజన్న, శంకర్, బిఎస్పి నాయకులు గజ్జల స్వామి, దబ్బేట సురేష్, తిరుపతి, సైదా విజయ్ తదితరులు గంగారెడ్డిని పరామర్శించారు.