చిన్నాపూర్ లో డబుల్ బెడ్ రూమ్ ల రగడ
గ్రామ సభను బహిష్కరించిన ప్రజలు !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ లో శుక్రవారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల రగడ తో గ్రామ సభను బహిష్కరించి, తహశీల్దార్ అధికారులను గ్రామస్తులు నిలదీశారు.

చిన్నాపూర్ గ్రామంలో 39 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు. వాటి పంపిణీ కోసం 28 మంది అర్హుల జాబితా తో బుగ్గారం తహశీల్దార్ మాజిద్, ఇటీవల బదిలీ పై వెళ్లిన తహశీల్దార్ ఫారుక్, వారి సిబ్బంది చిన్నా పూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ దమ్మ లత శ్రీ నర్సింగం అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. అర్హులైన నిరుపేదలు మాకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను నిలదీశారు. మీకు ఇండ్లు ఉన్నట్లుగా సమగ్ర సర్వే ఆన్ లైన్ లో నమోదు అయ్యాయని, ఆ సాంకేతిక కారణాలు హైదరాబాదు నుండి ప్రభుత్వం తొలగించాక ఇస్తామని అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం 28మంది అర్హులు ఉన్నారనీ, వారి జాబితాను ప్రకటించారు. ఇందులో బంగళాలు ఉన్నోడికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా మంజూరు చేశారని ? అధికారులపై గ్రామస్తులు, లబ్దిదారులు మండి పడ్డారు. వెంటనే వారి పేర్లను తొలగించి, ఇండ్లు లేని మా నిరుపేదలకు ఇవ్వాలని మొరపెట్టు కున్నారు. అంతవరకు ఈ 28 మంది జాబితా వారికి కూడా ఇండ్లు ఇవ్వనీయమని గ్రామస్తులు ఖరా ఖండిగా అధికారులకు చెప్పి గ్రామ సభను బహిష్కరించారు. చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగి వెళ్లారు.


అర్హత ఉండి ఇల్లు రానివారు మాట్లాడుతూ మాకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. పూర్తిగా నడవలేని, ఎలాంటి ఆధారం కూడా లేని నిరుపేద వికలాంగుడనైన నాకు కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాం:
తహశీల్దార్ మాజిద్

చిన్నాపూర్ గ్రామ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్య వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పూర్తి వివరాలతో కూడిన సమాచారం నివేదిక రూపంలో ఇస్తామని తహశీల్దార్ మాజిద్ తెలిపారు. ఉన్నతాధి కారుల నిర్ణయం మేరకే తదుపరి నిర్ణయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు.