.J.SURENDER KUMAR.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పిస్తే ప్రాజెక్టు పర్యవేక్షణ మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్తుంది కాబట్టి కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకే కాలేశ్వరం ప్రాజెక్టును ₹ 1,20,000 వేల కోట్లతో నిర్మాణం చేసి, సీఎం రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు అని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఎండపల్లి మండలం రాజరాంపల్లె లో శుక్రవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,లు మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 మీడియా సమావేశంలో హైలెట్స్..
👉 కాలేశ్వరం ప్రాజెక్టు మరియు యాదాద్రి పవర్ ప్రాజెక్టు రెండింటి నిర్మాణం చేసి ముఖ్యమంత్రి కెసీఆర్ గారు లక్ష 70 వేల కోట్ల రూపాయల అప్పు భారాన్ని తెలంగాణ ప్రజానీకం పై మోపడం జరిగింది. ఈ విషయంలో ప్రజలకు కెసీఆర్ గారే జవాబుదారి అని చెప్తున్నాం
👉 ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థపూరిత రాజకీయల కోసం కమీషన్లకు కక్కుర్తిపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో 2019-20 వరకు మిత్రపక్షంగా ఉంటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని చెయ్యలేదు.
👉 రైతు బందు ఇస్తున్నాం అనే నెపంతో మిల్లర్ల చేతిలో రైతులను దోపిడీకి గురి చేశారు అన్నారు.
👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి క్వింటాలకు ₹ 500 రూపాయల చొప్పున అదనంగా చెల్లిస్తాం.
👉 తెలంగాణ రైతాంగానికి సాగునీటి కోసం 4వేల మెగావాట్ల విద్యుత్ నీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఆర్థిక బారం పడకుండా రాష్ట్రానికి లభించే విధంగా విభజన చట్టంలో చెప్పడం జరిగింది.
👉 రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఆర్థిక భారం పడకుండా వచ్చే విద్యుత్ విషయంలో NTPC పై ఎటువంటి ఒత్తిడి చేయకపోగా యాదద్రి దగ్గర 4 వేల మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది
👉 ఉద్యమ సమయంలో బొగ్గు లభ్యత ఉన్న చోట విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు కమిషన్ల కోసం యదాద్రిలో 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది
👉 తెలంగాణ రైతాంగం వ్యవసాయంపై ఆధారపడి ముందుకు వెళ్తుండడంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గంటల ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నారు.
👉 రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే,సాగు నీరు విషయంలో,విద్యుత్ విషయంలో, గిట్టుబాటు విషయంలో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రైతాంగం కోసం కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది
👉 ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన యూనివర్సిటీ నేల కోల్పబడలేదు, కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయకుండా జాప్యం చేయడం జరుగుతుంది
👉 ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర హక్కులను కాపాడలేని కేసీఆర్ గారు రేపు కేంద్రం నుండి మనకు రావాల్సిన హక్కులను ఏ విధంగా కాపాడగలుగుతారు

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండేటి జితేందర్ రెడ్డి, వెల్గటూర్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, గొల్లపల్లి మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ధర్మారం మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, MPTC మంజుల, ఎండపల్లి బిసి సెల్ అధ్యక్షులు మల్లేశం, రాజిరెడ్డి, అధికార ప్రతినిధి గాజుల విజయ్, సోమిశెట్టి రమేష్ , చంద్రమౌళి, శ్రవణ్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, మాచెర్ల సంజీవ్, మహేష్, అశోక్, సుశీల్, పోలోజు శ్రీనివాస్, కుమార్ స్వామి, వెంకటస్వామి, జితేందర్, బుచ్చయ్య, గంగయ్య, రవి, లక్ష్మణ్, శ్రీధర్, భైరం రెడ్డి, రాజయ్య, సాయి, వినోద్ తదితరులు పాల్గొన్నారు