👉 గణపతి ఎన్ కౌంటర్ కు 54 ఏళ్ళు..
J.SURENDER KUMAR.
మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కి విప్లవ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తామాడ గణపతి కమ్యూనిస్టు భావజాలానికి బహుదూరం. ఆయన ఎన్కౌంటర్ కు సెప్టెంబర్ 22 నాటికి 54 ఏళ్లు. మూఢా విశ్వాసాలు, ఆచారాలు రూపుమాపడం కోసం గ్రామ ప్రజలను చైతన్యవంతులు చేసిన సాధన సురుడు, వివేకానందుడి, రామకృష్ణ పరమహంస ఆశయాలు, ఆలోచనలు పట్ల అవగాహన చేసుకొని ఆచరించాలని ఆశించిన వ్యక్తి తమాడ గణపతి. ఆ దిశగా సంస్కరణ ల పరంపరలలో కమ్యూనిస్టుగా ముద్ర పడి భూస్వాముల కుట్రలకు బలి అయ్యాడని రక్త సంబంధీకుల ఆవేదన.

వివరాల్లోకి వెళ్తే…
బొడ్డుపాడు గ్రామానికి చెందిన తామడ గణపతి సరిహద్దు ఒరిస్సా రాష్ట్రంలో (రాజులు కోటలో ఉన్న విద్యాసంస్థలో) ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో గణపతి తండ్రి మృతి తో గ్రామానికి చేరుకున్న గణపతి గ్రామంలో నెలకొన్న దురాచారాలు, మూఢనమ్మకాలు, ఆచారాలు, నిరక్షరాస్యత, విద్యుత్ సౌకర్యం లేక అంధకారం, రాళ్ళూ రప్పలతో బురద మాయమైన రహదారులు, తాగునీటి, వసతి లేక వాగులు, చెలిమెల వద్దకు కిలోమీటర్ల దూరం నడిచినీరు తెచ్చుకోవడం, 90 శాతం ప్రజలకు బియ్యం కొనుగోలు శక్తి లేకపోవడం, ఉత్తరాలు రాయడానికి, చదివించుకోవడానికి పొరుగు గ్రామాలకు వెళ్లి అక్షరాస్యుల సహాయ సహకారాలు పొందడం. ప్రధానంగా గ్రామంలో అంటరానితనం. విద్య, వైద్య సౌకర్యాలు లేకపోవడం, యువత సారా, పొగ మత్తుకు బానిసలు కావడం ఉపాధి లేకపోవడం, దేశంలోని చాలా గ్రామాల మాదిరిగానే బొడ్డపాడు చాలా వెనుకబడి ఉంది. అమానుషమైన జీవన స్థితిగతులు గ్రామంలో నెలకొన్న తదితర అంశాల పట్ల తామాడ గణపతి, కలత చెంది కార్యాచరణకు శ్రీకారం చుట్టాడు.
యువజన సంఘ కార్యకలాపాలకు 65 ఏళ్లు !

1954 లో బొడ్డపాడు యువజన సంఘంను తామడ గణపతి ఏర్పాటు చేశారు. నేటికీ బొడ్డపాడు యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. యువకులను క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి గ్రామంలో యువతను చైతన్యవంతం చేశారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, మద్యం మరియు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలు మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా, అక్షరాస్యతకు అనుకూలంగా, అలాగే కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా గ్రామంలో రాజకీయ సమీకరణలకు గణపతి శ్రీకారం చుట్టారు.. ఈ యువజన సంఘం బొడ్డపాడు గ్రామం తో పాటు పరిసర 20, 30 గ్రామాలకు విస్తరించింది. తాగునీరు, పాఠశాల వంటి ప్రాథమిక హక్కులను డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా నిర్వహించింది. వారు తమ స్వంత చొరవతో పాఠశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలు, ఉన్నత పాఠశాల డిమాండ్‌ను తెచ్చారు. బొడ్డపాడు గ్రామంలో పిల్లలకు భోజనం, బస ఏర్పాటు చేసి బడిలో చేరేందుకు ప్రోత్సాహకలు అందించారు. గణపతి 20 మంది వాలంటీర్లు ఎంపిక చేసి గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో రాత్రిపూట బడులు.. గోడలపై రాతలు, ప్రజలను చైతన్య పరచడానికి వీధి నాటకాలు, చేతిరాతతో బ్యానర్లు వ్రాసి ప్రదర్శించడం, గణపతి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకుంటారు. నేటికి గ్రామ సమస్యల పరిష్కారం, సంతాప సభలకు, సన్మానాలకు, విప్లవ భావజాలాల సభల కోసం గ్రామస్తులు ఓ సమావేశ మందిరాన్ని నిర్మించారు.

యువత, ప్రజలు ఎర్రజెండాలు చేత పట్టుకొని కార్యక్రమాలకు హాజరైన ఎర్రజెండాలపై ఉదయిస్తున్న సూర్యుడి గుర్తు, బొడ్డపాడు యువజన సంఘం ఉంటుంది. యువకులు ధరించే ‘ టీ షర్టు ల పై కూడా ఉదయిస్తున్న సూర్యుడు బొడ్డెపాడు యువజన సంఘం ముద్రించబడి ఉంటుంది.’
బొడ్డపాడు కేంద్రంగా.. కమ్యూనిస్టు కార్యకలాపాలు!

కమ్యూనిస్టులు, సుబ్బారావు ప్రాణిగ్రహి, ధర్మపురి కృష్ణమూర్తి, పంచాది కృష్ణమూర్తి, తులసి దాస్ తదితరులు దొడ్డపాడు ను కేంద్రంగా చేసుకొని, యువత, మహిళలలో ఏనలేని ప్రజాదరణ ఉన్న తామాడ గణపతి తో దశాబ్ద కాలంకు పైగా వారు సావాసం చేసి కమ్యూనిస్టు భావజాల వ్యాప్తి కోసం కరుడుగట్టిన కమ్యూనిస్టుగా గణపతి, తీర్చిదిద్ది తమ కమ్యూనిస్టు కార్యకలాపాలకు వాడుకున్నారు అనే చర్చ ఆ ప్రాంతంలో ఉంది..1969. సెప్టెంబర్ 22న పోలీస్ కాల్పులలో గణపతి అమరత్వం పొందారు అని ఆయన రక్త సంబంధికులు ఆవేదన వ్యక్తం చేశారు.
విప్లవ వారసత్వ గ్రామం !

1967లో గిరిజన సంఘం సదస్సుకు వచ్చిన వివిధ గ్రామాల నుండి గిరిజన ఆదివాసీలను సమీపంలోని అడవిలో జమీందార్లు కాల్చి చంపారు. 1967 – 1971 మధ్యకాలంలో 12 మంది సహచరులు పోలీసుల చేతిలో హత్యకు గురయ్యారు, పంచాద్రి కృష్ణమూర్తి, తామడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి, పోతనపల్లి అప్పారావు, పంచాద్రి నిర్మల, తేలుకల సరావతి, మదనాల దుష్యంత్, దున్న గోపాలరావు, గేదల లోకనాదం, బైరపల్లి పాపారావు, బైరపల్లి పాపారావు లు మృతి చెందారు. పోలీసుల తీవ్ర నిర్బంధ , దొడ్డపాడు ప్రాంతాన్ని ప్రభుత్వం. కల్లోలితో ప్రాంతంగా ప్రకటించి విప్లవ ఉద్యమాన్ని అణచివేసింది.
ఆర్థికంగా బలమైన కుటుంబం!
బొడ్డపాడులో ఐదు, ఆరు ధనిక కుటుంబాలలో గణపతి కుటుంబం అంగబలం, ఆర్థిక బలం తో పాటు అగ్రవర్ణం (కమ్మ) పది ఎకరాల భూస్వామ్య కుటుంబం.
మూడు సార్లు సర్పంచ్ గా గణపతి కుమారుడు !

బోడ్డపాడు గ్రామానికి దాదాపు మూడు సార్లు ఆయన కుమారుడు తామడ సులోచన రావు, సర్పంచ్ గా కొనసాగారు, మరో కుమారుడు మధు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగ విరమణ చేశారు. కూతురు అరుణ విజయవాడలో ఉపాధ్యాయురాలు. ఉద్దాండ ప్రాంతం బొడ్డపాడు లో ఐదు దశాబ్దాల క్రితం అమరుడైన తామడ గణపతి, త్యాగనిరతి తపన, సేవ భావం ప్రజల హృదయాలలో. చిరంజీవి గా చిరస్థాయిగా ఉండడం అభినందనీయమే.