దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు జస్టిస్ హిమబిందు !

👉మాజీ సీఎం చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి !


👉సామాన్యులలో తీర్పు నమ్మకం పెంచింది!


J.SURENDER KUMAR.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిన జస్టిస్ పేరు హిమబిందు.

చట్టం తన పని తాను చేసింది!


నాలుగున్నర దశాబ్దాల ప్రత్యేక్ష రాజకీయాల్లో దేశవ్యాప్తంగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు .  ఆయనపై ఎన్ని ఆరోపణలున్నా ఇప్పటివరకు ఏ కేసులోనూ, జైలు గడప తొక్కింది లేదు. స్కిల్‌ స్కామ్‌ డెవలప్‌మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం. ఏసీబీ కోర్టులో హాజరుపరచడాన్ని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇదంతా 24 గంటల్లో జరిగిపోయింది. నిరసనలు, హౌస్‌ అరెస్ట్‌లతో. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం  అట్టుడికింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని అంతా ఉత్కంఠంతో ఎదురుచూస్తూ టీవీలకు అతుక్కుపోయారు.  అందరి చూపు ఆ జడ్జిపైనే ఉంది. నిజానికి చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడికి సంబంధించి తీర్పు ఇస్తున్నారు అంటే ఒత్తిడి ఉంటుందని అనుకుంటారు. అయితే ఆ జడ్జిని ఎలాంటి టెన్షన్‌ పడుతున్నట్టు అనిపించలేదు. ఇరు వాదనలు విన్నారు.. ఏం చేయాలో అదే చేశారు.. మరో మాట లేకుండా చంద్రబాబుకు రిమాండ్  విధించారు. ఈ తీర్పు గురించి వివిధ వర్గాల్లో భిన్నభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అందరి నోటా మాత్రం జస్టిస్‌ హిమబిందు పేరు మారుమోగుతోంది. అటు సామాన్యుల్లోనూ ఈ తీర్పు నమ్మకాన్ని మరింత పెంచింది.


జస్టిస్‌ హిమ బిందు …

జస్టిస్‌ బొక్క​ సత్య వెంకట హిమ బిందు.. చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు ఇది. స్వగ్రామం భీమవరం, జడ్జి హిమబిందు తండ్రి చంద్రశేఖర్ న్యాయవాది, నోటరీ న్యాయవాదిగా గుర్తింపు ఉంది. బీసీ సామాజిక వర్గం, ప్రస్తుతం దేశం తో పాటు రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందు దే.  2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు జస్టిస్ హిమబిందు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 18, అంటే 2023న, సీబీఐ నిర్వహించే అంశాలకు సంబంధించి ఆమెకు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి పదవిని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్‌ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.


జస్టిస్ హిమబిందు తీర్పులో..

రిమాండ్ తీర్పు


చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నిందితులతో ప్రాథమికంగా కుమ్మక్కయ్యారని ప్రాసిక్యూషన్‌తో జస్టిస్ హిమబిందు అంగీకరించారు. చంద్రబాబుపై అభియోగాలు మోపిన నేరాలు ఐపీసీ (IPC) కింద గణనీయమైనవన్నారు. రిమాండ్ రిపోర్టులోని అంశాలు, సాక్షుల వాంగ్మూలం, సేకరించిన అంశాలు.. చంద్రబాబు ప్రభుత్వోద్యోగిగా విధులు నిర్వహిస్తూనే నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని కోర్టు పేర్కొంది. అవినీతి, చట్టవిరుద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వ నిధులను ₹279 కోట్ల మేర దుర్వినియోగం చేసి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారన్నారు.
ఇతర నిందితులు, షెల్‌ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు సంబంధాన్ని ఏర్పరచడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తేల్చింది. అదేవిధంగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆమోదంలో చంద్రబాబు పాత్రకు కావాల్సింత మెటీరియల్ ఉందని కోర్టు తెలిపింది.