J.SURENDER KUMAR,
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధర్మపురిఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ ఇంచార్జ్ గా. మహారాష్ట్రలోని పూణే మాజీ ఎమ్మెల్యే మోహన్ జోషిని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించింది.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏఐసిసి నుండి ఇంఛార్జ్ లను నియమించిందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ. లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
శనివారం ధర్మపురిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఈ నెల 5న పార్టీ ఇంచార్జ్ జోషి ధర్మపురి లో నియోజకవర్గంలోనీ ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశనం చెయ్యనున్నారు అని వివరించారు.
ఈ సందర్భంగా పలు సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మోసపూరిత హామీలు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు తదితర అంశాలపై ప్రభుత్వంపై, స్థానిక మంత్రి పై పలు ఆరోపణలు చేశారు.
ఈ సమావేశంలోధర్మపురి నియోజవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్,.మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్ధిన్, NSUI అసెంబ్లీ అధ్యక్షులు అప్పం శ్రవణ్, గరిగె రమేష్, శ్రీకాంత్, భరత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు..