J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గానికి (LDMRC )లీడర్ షిప్ డెవలప్మెంట్ మిషనింగ్ ఇన్ రిజర్వుడ్ కాన్స్టెన్సీ కి సంబందించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇంచార్జి కర్ణాటకకు చెందిన శ్రీకాంత్ , జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లురి లక్ష్మణ్ కుమార్ ఆద్వర్యంలో మంగళవారం నియోజవర్గస్థాయి సమావేశం నిర్వహించారు.
మండల అద్యక్షులు మరియు బూత్ ఇంఛార్జులు, సర్పంచులు, ఎంపీటీసీలు,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, NSUI నాయకులు, మండల మైనార్టీ సెల్, బిసి సెల్,ఎస్సీ సెల్ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి, నియోజకవర్గ స్థాయిలో పార్టీ గెలుపుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ LDM కోఆర్డినేటర్ శ్రీకాంత్,పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఎంపిటిసి కుంట సుధాకర్, కస్తూరి శ్రీనివాస్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందెని మొగిలి, పెగడపల్లి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్, బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నర్సగౌడ్, మల్లేష్, సుముక్, పురుషోత్తం, ప్రవీణ్,గణేష్, శ్రీకాంత్, కమలాకర్, శ్రీకాంత్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు