J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ ఆదివారం ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
దేవస్థానం పక్షాన సాదరంగా స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు వేద పండితులు ఘనంగా ఆశీర్వదించారు. దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య, శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం అందించి సన్మానించారు.

స్వర్గీయ మాజీమంత్రి జువాడి రత్నాకర్ రావు మా కుటుంబ సభ్యులు.. దిల్ రాజ్ !
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మా ఇంటి దైవం ఇలవేల్పు, స్వర్గీయ మాజీ మంత్రి జువారి రత్నాకర్ రావు, మిత్రులు నర్సింగరావు, మేము కుటుంబ సభ్యులము , ఈ సందర్భంగా నిర్మాత ప్రకటించారు దిల్ రాజ్ మీడియాతో అన్నారు. మా తండ్రి,తాత ముత్తాతల నుంచి ధర్మపురి స్వామి వారి దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరుగుతున్నది అన్నారు. నా కుమారుడి తలనీలాల మొక్కులు చెల్లించుకోవడానికి మా కుటుంబం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నామని, అన్నారు.

ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్, నా బెస్ట్ ఫ్రెండ్ !
ధర్మపురి క్షేత్రానికి చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ హరి శంకర్ నా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి అనేక సినిమాలు పనిచేశాము అన్నారు. ధర్మపురి క్షేత్రం గురించి స్వామి గురించి సంపూర్ణ అవగాహన ఉందన్నారు. దైవభక్తి గల మా కుటుంబం మా స్వగ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపురూపంగా నిర్మించడం జరిగిందన్నారు. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వడి నర్సింగరావు,

ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రమణయ్య, DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, రెనవేషన్ కమిటి సభ్యులు వేముల నరేష్ , అక్కనపల్లి సురేందర్, స్థంభంకాడి మహేష్, చుక్క రవి , దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ సంపత్ కుమార్, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.