ధర్మపురి నరసింహుడి ని దర్శించుకున్న మునిసిపల్ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరియు ఎలక్షన్ అబ్జర్వర్ సుదర్శన్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు.

వీరికి దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, శేష వస్త్రం ప్రసాదం అందజేసి సన్మానించారు.


ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్, జగిత్యాల RDO నర్సింహమూర్తి , స్థానిక MRO క్రుష్ణచైతన్య, మున్సిపల్ కమిషనర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.