J.SURENDER KUMAR ,
ధర్మపురి నియోజకవర్గ జగిత్యాల, పెద్దపల్లి జిల్లా పరిధిలోని చౌరస్తాల వెడల్పు, సుందరీకరణ కు G.O.Rt.No.365 ప్లానింగ్ (VI) విభాగంలో స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (SDF 2023 -24 )- నిధుల క్రింద 03 పనుల గాను ₹ 20 కోట్ల నిధులు కేటాయించినట్ట మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటనలో పేర్కొన్నారు.

👉 జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం వద్ద జంక్షన్ కోదాడ రహదారి (కూడలి) అభివృద్ధి మరియు విస్తరణ కోసం ₹3.50 కోట్ల
👉 జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి చౌరస్తా వద్ద జంక్షన్ విస్తరణ లో భాగంగా అభివృద్ధి కోసం ₹ 2 కోట్లు,
👉 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఫోర్ లైన్, డివైడర్ మరియు డ్రైనేజీ, మరియు నిర్మాణానికి ₹14 .50 కోట్లు
మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.