గణేష్  నిమజ్జనం ఏర్పాట్లలో అవకతవకలపై
కలెక్టర్  కు కౌన్సిలర్ ఫిర్యాదు !

J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలో వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా చింతకుంట చెరువులోని గుఱ్ఱపు డెక్కను, పిచ్చి మొక్కలు, తొలగించుట, గజ ఈతగాళ్ళను మరియు నాటు తెప్పలకు గాను ₹ 5 లక్షల రూపాయలు మున్సిపల్ ఆమోదం తీసుకున్నారు.  నిధుల ఆమోదంలో అవకతవకలు జరిగాయని కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ మంగళవారం కలెక్టర్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కౌన్సిలర్ ఫిర్యాదు పత్రం

ఇంజనీరింగ్ అధికారులు చెరువును పరిశీలించకుండా ఫీల్డ్ మీదకు వెళ్ళకుండా ఎస్టిమేట్ చేశారని ఆమె పేర్కొన్నారు.
“48” వార్డులను 4 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్ కు ₹ 5 లక్షల రూపాయలతో మొరం, చిప్స్, డస్ట్ ప్రతి ఒక్క వార్డుకు సంబందించి గుంతలు పూడ్చుటకు టెండర్ పెట్టారు. తిరిగి  మళ్ళీ గణేష్ నిమజ్జనం కొరకు ప్రధాన రహదారులలో గుంతలు పుర్చుటకు  తిరిగి ₹5 లక్షల  టెండర్ పిలవటం జరిగింది. ₹ 25 లక్షల మొరం ఏవిధంగా అవసరం ? ఎక్కడ అనేది గుర్తించకుండా గుడ్డిగా అధికారులు అంచనా వేయడం, టెండర్లు పిలవడం జరుగుతుంది. అని పేర్కొన్న రు. పట్టణంలో దాదాపు అన్ని వార్డులలో C.C రోడ్లు ఉన్నాయి. ఇన్ని లక్షల మొరం అవసరం ఉండదు. కావున దీనిపైన విచారణ జరిపి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకంగా రికార్డు చేయవలసిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు.
2.ఆగస్ట్ మాసం ఎజెండాలో అంశం నెం. “10”లో 7వ పాయింటు క్రింద వినాయక నిమజ్జనం ఏర్పాట్లలో విదులు నిర్వహించు సిబ్బందికి భోజన వసతి ఏర్పాటు చేయుటకు ₹1.50 ,( 1 ఒక లక్ష 50 వేల రూ,)  లకు కౌన్సిల్ ఆమోదం మరియు Action Taken  Report లో కూడ ఆమోదం తెల్పినట్లు గా కౌన్సిల్ సభ్యులకు ఇచ్చి తిరిగి ఈ అంశాన్ని మరల సెప్టెంబర్ మాసపు ఎజెండాలో అంశం నెం.’8′ లో సానిటేషన్ విభాగం ద్వారా ఖర్చు చేస్తామని ₹ 67,000/- రూ,, మంజూరి కొరకు ఆమోదం కొరకు పెట్టారు. ఈ అంశం రెండు సార్లు పొందుపర్చి కౌన్సిల్ ను తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. 

శుభ్రంగా ఉన్న చింతకుంట చెరువు(ఫైల్)

టెండర్  కు ముందు. చెరువును పరిశీలించగా చెరువులో కొంచెం తుంగ మాత్రమే ఉంది. ఈ తుంగను కూడ మున్సిపల్ సానిటేషన్ లో పనిచేసే కార్మికులు తొలగించారు. కావున ఇందులో గుఱ్ఱుపు డెక్కకు సంబంధించిన అంశానికి పెట్టిన మొత్తం రద్దు పరిచి మిగిలిన వాటికి చెల్లింపు అయ్యే విధంగా చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని కాపాడాలని ఆమె ఫిర్యాదు లో పేర్కొన్నారు.