J.SURENDER KUMAR,
లోక కళ్యాణం కోసం ధర్మపురి క్షేత్రంలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొనసాగిన భాగవత సప్తాహం శుక్రవారం ఘనంగా ముగిసింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమంలో పాల్గొని ప్రవచకుడు బ్రహ్మశ్రీ కొరిడే విశ్వనాథ శర్మ దంపతులను దేవస్థానం పక్షాన ఘనంగా సన్మానించి ఆశీస్సులు పొందారు. స్వామి వారి చిత్రపటాన్ని. ప్రసాదం శేష వస్త్రాన్ని మంత్రి విశ్వనాధ్ శర్మ దంపతులకు అందించారు.

శారదా మహిళా మండలి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22న కోరిడే విశ్వనాథ శర్మ , ప్రవచనాలతో భాగవత సప్తాహ కార్యక్రమం” అత్యంత వైభవంగా మొదలైంది. శుక్రవారం ముగింపు సందర్భంగా స్థానిక గోదావరి పురోహితుడు ఇందారపు వెంకటరమణ, జయలక్ష్మి దంపతులు, అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగి సత్తెమ్మ , మార్కెట్ కమిటి చైర్మన్ అయ్యోరి రాజేష్ , డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి
కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య రెనవేషన్ కమిటి సభ్యులు గందె పద్మ , అక్కనపల్లి సురేందర్, ఇనగంటి రమా వెంకటేశ్వరరావు, గునిశెట్టి రవీందర్ , వేముల నరేష్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు