J.SURENDER KUMAR.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం వైష్ణవ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా పూజాది వేడుకలు,కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ప్రదానదేవాలయంలోగల బలరామక్రుష్ణుని వద్దగల శ్రీస్వామివారికి షోడశోపచార పూజా, అష్ఠోత్తరశతనామపూజ , క్రుష్ణాష్టకస్త్రోత్రపారాయణం , విష్ణుసూక్తములతో అభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు ముత్యాల శర్మ , ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచారి , ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ , రమణయ్య , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ , రాజగోపాల్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, మరియు అర్చకులు సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు.