జగిత్యాల జిల్లా లో పోలీస్ యాక్ట్ –
ఈనెల 30 వరకు అమలు !

ఎస్పీ ఎగ్గడి భాస్కర్


J.SURENDER KUMAR

జగిత్యాల జిల్లా పరిధిలో ఈనెల 1 నుండి 30 సెప్టెంబర్ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ భాస్కర్ ప్రకటించారు.
22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b) & సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76 యాక్టు ఆమలులో వుంటుంది అని ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.

ముందస్తు అనుమతి తీసుకోవాలి!

పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి. వివిధ కారణాలచే ర్యాలీలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ప్రకటనలో కోరారు.