👉 ప్రేమ పెళ్లి ఒప్పుకోకపోవడంతోనే హత్య !
👉 చందన ఆమె ప్రియుడు మరో ముగ్గురి అరెస్ట్
👉 74 గంటల్లోనే వేటాడి పట్టుకున్న పోలీస్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హత్యకు గురి అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి, హత్య మిస్టరీని జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం కేవలం 74 గంటల్లో చేదించి హత్యకు పాల్పడ్డ చెల్లె బంక చందన, ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ తో పాటు మరో ముగ్గురిని శనివారం అరెస్టు చేశారు.
ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దీప్తి హత్య జరిగిన తీరును వివరించారు.
గత నెల 29 న కోరుట్ల పట్టణానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, తన పెద్ద కూతురైన బంక దీప్తి ( 22 ) తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిందని కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బంక శ్రీనివాస్ రెడ్డికి ఇద్దరు కూతుర్లు, పెద్ద కూతురైన బంక దీప్తి, గత కొద్ది రోజుల నుండి సాఫ్ట్ వేర్ ఇంటిలో నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నది. చిన్న కూతురైన బంక చందన 2019 సంవత్సరంలో మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంలో తన క్లాస్మేట్ అయిన ఉమర్ షేక్ సుల్తాన్ S/o హుస్సేన్ తో పరిచయమై వారి పరిచయం ప్రేమగా మారినట్టు విచారణలో వెలుగు చూసింది. చందన గత కొద్ది రోజుల నుండి కోరుట్లలోని తన ఇంటి వద్దనే ఉంటున్నది. తన బాయ్ ఫ్రెండ్ అయినా షేక్ సుల్తాన్ కు చందన ఫోన్ చేయగా అప్పుడప్పుడు కోరుట్ల కు వచ్చి చందనను కలుస్తుండేవాడు.

మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. హత్యకు ప్లాన్ !
ఈ క్రమంలో గత నెల 19- న కోరుట్లకు ఉమర్ వచ్చినప్పుడు చందన ఉమర్ తో మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరు బయటికి పోయి పెళ్లి చేసుకుందామని చెప్పగా అందుకు ఉమర్ జాబ్, డబ్బులు లేకుండా బయటకు వెళ్లి ఎలా అని చందనను ఉమర్ అడగగా మనం ఏదైనా సరే పెళ్లి చేసుకోవాలని చందన ఉమర్ కు చెప్పగా ఉమర్ వాట్సాప్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులైన తల్లి సయ్యద్ ఆలియా మహబూబ్, చెల్లె ఫాతిమా మరియు తన ఫ్రెండ్ అయిన హఫీజ్ తో కలిసి చందనతో మాట్లాడారు. తర్వాత రెండు రోజులకు చందన ఉమర్ కు ఫోన్ చేసి మా ఇంట్లో బంగారం డబ్బులు బాగా ఉన్నాయని వాటిని తీసుకెళ్లి మనం పెళ్లి చేసుకొని బతుకుదామని చెప్పింది. అప్పుడు ఉమర్ తన కుటుంబ సభ్యులకు చందన వద్ద పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు ఉన్నాయని వివరించారు.
తల్లిదండ్రులు ఊరు వెళ్లిన సమయంలో….
పథకంలో భాగంగా చందన ఉమర్ కి గత నెల 28న ఫోన్ చేసి ,మా తల్లిదండ్రులు హైదరాబాదులోని ఒక ఫంక్షన్ కి వెళ్తున్నారు. అక్క దీప్తి, నేను ఇద్దరమే ఉంటామని ఉమర్ కు చెప్పి రమ్మని చెప్పింది 28 న ఉదయం ఉమర్ కోరుట్ల కు చేరుకున్నాడు.
పథకం ప్రకారం చందన వోడ్కా అక్క దీప్తికి త్రాగిపించి తను పడుకున్న తర్వాత రాత్రి 2:00 సమయంలో ఉమర్ కు తన ఇంటికి రమ్మని మెసేజ్ చేయగా ఉమర్ చందన ఇంటి వెనకాల కారును పార్కు చేసి ఇంటిలోకి వచ్చినట్టు ఎస్పీ వివరించారు. పథకం ప్రకారం బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బులు సర్దుతుండగా అలికిడికి అక్క దీప్తి లేచి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావే ? అని అరవగా, చందన, ఉమర్ లు ఇద్దరు కలిసి ప్లాస్టర్ తో దీప్తి ముక్కు, మూతికి స్కార్పు చుట్టి, చున్నీతో చేతులు కట్టేసి, మూతి, ముక్కుపై టేపును అంటించి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కట్లు విప్పారు. విప్పేసి మందు త్రాగి చనిపోయిందని నమ్మించే విధంగా సీన్ క్రియేట్ చేసి డబ్బు మరియు నగలుతో ఇంటి నుండి పారిపోయారు.
గాలింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు ?

నిందితులను పట్టుకోవడానికి జగిత్యాల SP భాస్కర్ ఆదేశాల మేరకు మెట్పల్లి DSP రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోరుట్ల CI ప్రవీణ్ కుమార్ మరియు ఐదు బృందాలు SI లు కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు ఐదుగురు నిందితులు కలిసి మహారాష్ట్ర వైపు పారిపోతున్నారని సమాచారం మేరకు ఆర్మూర్, బాల్కొండ రూట్లో జై వీర్ తేజ దాబా వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
నిందితులు పట్టివేత!
A-1 బంక చందన, A-2 ఉమర్ షేక్ సుల్తాన్, A-3 సయ్యద్ అలియా మహబూబ్ , A-4 షేక్ అసియా ఫాతిమా A-5 హఫీజ్ పట్టుకున్నారు
నిందితుల నుండి బంగారు వడ్డానంలు 2 పెద్ద బంగారు హారం 1 పెద్ద బంగారు గాజుల జత 3 ఒక బంగారు కంకణం చిన్న హారాలు1ఒక లక్ష రూపాయల నగదు వారి సెల్ ఫోన్లు మరియు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నరు
పోలీస్ బృందానికి ప్రత్యేక ప్రశంసలు !
చాకచక్యంగా వ్యవహరించిన మెటుపల్లి DSP రవీందర్ రెడ్డి, కోరుట్ల CI ప్రవీణ్ కుమార్, SI లు కిరణ్, SI చిరంజీవి, SI కిరణ్ కుమార్ , పోలీస్ కానిస్టేబుల్స్ విజయ్, పురుషోత్తం, శీను నాయక్ ల ను ఎస్పీ భాస్కర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.