కొండగట్టు అంజన్న కు. ఆమడ దూరం కానున్న  మారుతి మాయాజాలం!

👉 ఫౌండర్ ట్రస్టీ పై చర్యలు వండర్ !
👉 విచారణలో వెలుగుచూసిన వైనం !
👉 హర్షం వ్యక్తం చేస్తున్న అంజన్న భక్తులు !

J.SURENDER KUMAR.

మహన్విత మహిమగల కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి కి ఇక నుంచి ఆమడ దూరం కానున్న మారుతి మాయాజాలం. కొండగట్టు ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామిని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో అంజన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే

గత నెల 9న కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామి బంగారు,వెండి ఆభరణాలు హుండీ లెక్కింపులో నిబంధనలకు విరుద్ధంగా తన వెంట తీసుకుపోయాడని. ఆలయ ధర్మకర్త జున్ను సురేందర్, ఆలయ పరిధిలోని ముత్యంపేట గ్రామ సర్పంచ్ తిరుపతిరెడ్డి ఆలయ కార్యనిర్వాహణాధికారికి, దేవాదాయ శాఖ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఉదాంతం పై ఈవో గత నెల 17న కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అడిషనల్ కమిషనర్ కొండగట్టుకు వచ్చి ఫిర్యాదు ఉదాంతం పై  పై సమగ్ర విచారణ చేపట్టి ఆగస్టు 21న కమిషనర్ కు నివేదిక సమర్పించింది. నివేదిక పరిశీలించిన కమిషనర్, ఈ అంశంపై ఆగస్టు 29న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ,జ్యోతి కే.. మెమో సంఖ్య B1/10832/2023, తేదీ 8/09/2023. కొండగట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ట్రస్టీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్లాస్టిక్ బకెట్ నుంచే తస్కరణ ?

విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు. హుండీ లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారు వెండి ఇతర వస్తువులను, హుండీ లెక్కింపు ప్రదేశంలోనే నూతన ప్లాస్టిక్ బకెట్ ఉంచి ఆభరణాలు అందులో వేస్తుంటారు. నోట్లు, నాణేలను భక్తులు, సిబ్బంది, నిఘా నీడలో లెక్కిస్తూ డినామినేషన్ వేస్తుంటారు. ఈ లెక్కింపు పిదప వెండి, బంగారు ఆభరణాలు వస్తువులను, అప్రైజర్, ( నిపుణుల సమక్షంలో పరిశీలించి). తూకం వేసి రికార్డులలో నమోదు చేస్తారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్టీ మారుతి స్వామి, నూతన ప్లాస్టిక్ బకెట్ లోంచి కొన్ని బంగారు,వెండి వస్తువులను తీసుకున్నాడని, ఎడమ చేతి ఉంగరపు వేలుకు ఉంగరం ధరించి, మౌనంగా హుండీ లెక్కింపు ప్రాంగణం నుంచి బయటకు వెళ్లినట్టు, విచారణ అధికారి తన నివేదికలో పేర్కొనడంతో పాటు, సీసీటీవీ ఫుటేజ్ లను భద్రపరచి . విచారణ నివేదికతో పాటు ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం.

దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ జారీ చేసి ఉత్తర్వులు.


ఈ మేరకు దేవాదాయ, హిందూ చారిటబుల్ చట్టం తదితర నిబంధనల మేరకు ఫౌండర్ ట్రస్టీ నీ సస్పెండ్ చేస్తూ, వారం రోజులలో వివరణ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి తిరిగి ఉత్తర్వులు జారీ వెలువడే అంతవరకు ట్రస్టీ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వులలో పేర్కొన్నట్టు సమాచారం.

హుండీ లెక్కింపు నిబంధనలు ఇలా..

హుండీ లెక్కింపు తేదీని కొన్ని రోజులు ముందుగా పత్రికల్లో ప్రకటించాలి. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారుల, హుండీ లెక్కింపు దారుల వద్ద ఉన్న వ్యక్తిగత నగదు వివరాలను,. శరీరం పై ఉన్న నగలు ఉంగరాలు, బంగారు ,గొలుసులు చేతి గడియారాలు ఉంటే రికార్డులలో నమోదు చేయాలి, లెక్కింపు ప్రాంగణంలో రాకపోకలు సమయంలో  తనిఖీ, వీడియో రికార్డింగ్. నిరంతరం కొనసాగించాలి. హుండీ లెక్కింపు మధ్యలో ఎంతటి ఉన్నతాధికారి అయిన బయటకు వెళితే తనిఖీలు తప్పనిసరిగా చేయాలి. అలాంటి తదితర నిబంధనలను ఆలయ అధికారులు ఎందుకు పాటించాల్సి ఉంటుంది. ఫౌండర్ ట్రస్టీ ప్రాంగణం నుంచి బయటికి వెళుతుండగా తనిఖీలు చేశారా? లేదా? అనేది విచారణ అధికారులు తేల్చాల్సి ఉంటుంది.

చర్యకు ప్రతిచర్య ?

కొండగట్టు ఈవో ఫౌండర్ తస్థితికి జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు

కొండగట్టు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం  ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమించినా పాలన, పర్యవేక్షణ అంశాలలో అధికారులు ఫౌండర్ ట్రస్టీ ఆదేశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అమలుపరిచేవారు అనే ఆరోపణలు ఉన్నాయి. పాలకవర్గ సభ్యులు ఉత్సవ మూర్తులుగా, నామమాత్రంగా కొనసాగే వారు. దీనికి తోడు అర్చక స్వాములలోనూ వర్గాలుగా ఏర్పడడం పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం. తన మాట చెల్లుబాటు కాకపోతే. ఫౌండర్ ట్రస్ట్ హోదాలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు, అంజన్న దర్శనానికి వచ్చే వీఐపీలకు ఫిర్యాదులు చేస్తూ వేధించేవాడని, రాజీకి వచ్చిన అధికారుల అర్చకుల పై తాను చేసిన ఫిర్యాదులను ఉపసంహరించుకునేవాడు  అనే ఆరోపణలు ఉన్నాయి. తన మాట చెల్లుబాటు అయ్యేలా కొందరు అధికారులను అర్చకులను ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసేవాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం వందలాది కోట్ల నిధులు విడుదల చేయడం పనులకు భూమి పూజ చేయడంతో   ట్రస్టీ సస్పెండ్ కావడంతో  పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు, అధికారులు. కలిసికట్టుగా ఆలయాలు అభివృద్ధి పనులు త్వరితగతిన చేపడుతారని అంజన్న భక్తులు ఆశిస్తున్నారు.