👉ప్రభుత్వ మెమో ను సస్పెండ్ చేసిన హైకోర్టు !
J.SURENDER KUMAR.
దేవాదాయ శాఖ గత కొన్ని రోజుల క్రితం సస్పెండ్ చేసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ ఫౌండర్ ట్రస్టీ టీ.మారుతి స్వామిని, హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఫౌండర్ ట్రస్టీ గానే కొనసాగించాలని దేవాదాయ శాఖను ఆదేశిస్తూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలతో పాటు ప్రభుత్వం. సస్పెండ్ చేస్తూ జారీచేసిన మెమోను సైతం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సస్పెండ్ చేసింది.

ట్రష్టి మారుతి స్వామి తన సస్పెన్షన్ అన్యాయం అంటూ హైకోర్టు ను W.P.NO. 25562 ద్వారా ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రతిని శనివారం మారుతి స్వామి కొండగట్టు ఆలయ ఈవోకు అందించారు.

వివరాలు ఇలా ఉన్నాయి.
గత నెల 9న కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు జరిగింది. ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామి బంగారు,వెండి ఆభరణాలు హుండీ లెక్కింపులో నిబంధనలకు విరుద్ధంగా తన వెంట తీసుకుపోయాడని. ఆలయ ధర్మకర్త జున్ను సురేందర్, ఆలయ పరిధిలోని ముత్యంపేట గ్రామ సర్పంచ్ తిరుపతిరెడ్డి ఆలయ కార్యనిర్వాహణాధికారికి, దేవాదాయ శాఖ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ ఉదాంతం పై ఈవో గత నెల 17న కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అడిషనల్ కమిషనర్ కొండగట్టుకు వచ్చి ఫిర్యాదు ఉదాంతం పై పై సమగ్ర విచారణ చేపట్టి ఆగస్టు 21న కమిషనర్ కు నివేదిక సమర్పించింది. నివేదిక పరిశీలించిన కమిషనర్, ఈ అంశంపై ఆగస్టు 29న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ,జ్యోతి కే.. మెమో సంఖ్య B1/10832/2023, తేదీ 8/09/2023. కొండగట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ట్రస్టీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.