ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తిన జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
కుటుంబ పాలన గూర్చి మాకు ఎమ్మెల్సీ కవిత పాఠాలు చెప్పడం హాస్యాస్పదం అని, ఆవాక్కులు, చవాక్కులు మాట్లాడడం సరికాదని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కవితపై ధ్వజమెత్తారు.
జగిత్యాల లోఇందిరాభవన్ లో జీవన్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
జీవన్ రెడ్డి మాటలలో…
👉 బీసీలకు కేటాయించిన స్థానంలో బీసీలను కూర్చోబెట్టామనడం విడ్డూరం.. మీరు ఏమైనా జనరల్ స్థానాన్ని ఏమైనా బీసీలకు కేటాయించారా ?
👉 చక్కర కర్మాగారం పునఃప్రారంభిస్తామని చెప్పి.. మూసివేసింది నిజం కాదా.?
👉 బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం స్థలం లోని మామిడి మార్కెట్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్..
👉 యావర్ రోడ్డు 40ఫీట్ల నుండి 60ఫీట్లకు పెంచాం.. గ్రామ గ్రామాన విద్యుత్ సరఫరా.. తాగునీటి సరఫరా..మౌలిక వసతుల కల్పనకు పెద్దపీఠ వేశాం .
👉 ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేశామని, తాగునీరు, విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించి, మౌలిక వసతులకు పెద్దపీఠ వేశామన్నారు.
👉 బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్న మామిడి మార్కెట్ను రైతుల కోసం 25 ఎకరాల్లో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
👉 ఎన్నికలు రాగానే యావర్ రోడ్డు అంశం తెరపైకి తీసుకువస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో యావర్ రోడ్డును 40ఫీట్ల నుండి 60ఫీట్లకు పెంచామని గుర్తు చేశారు.
👉 2017 జూన్ 30న జగిత్యాల అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ తాటి పర్తి విజయ లక్ష్మి అద్వర్యంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు యావర్ రోడ్డును 100ఫీట్లకు పెంచాలని ప్రతిపాదన చేశామని, యావర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరువస్తుందనే అక్కసుతో అనుమతి ఇవ్వకుండ ఏడాదికాలం తొక్కిపెట్టారని, ఎన్నికల్లో యావర్ రోడ్డు అంశాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు.
👉 కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నచోట మాత్రమే రోడ్డు యావర్ రోడ్డు వెడల్పు చేశారని, ప్రైవేట్ ఆస్తులు ఉన్న చోట వెడల్బు చేయలేదని అన్నారు.
👉 ఉమ్మడి రాష్ట్రంలో స్థలం సేకరించి, నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపడితే వివిధ దశల్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని, పూర్తిచేయకుండ అదే స్థలంలో డబల్ బేడ్రూం ఇళ్ల నిర్మాణం తెరపైకి తీసుకువచ్చి, ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదన్నారు.
👉 మున్సిపల్ ఐలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న నాయకులు యావర్ రోడ్డు వెడల్పులో స్థలం కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేయకుండ టీడీఆర్ తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
👉 బోర్నపల్లి వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని 2014లో సీఎం కేసీఆర్ కు విన్నవించుకోగా, వంతెన మంజూరు చేశారని, సీఎం కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో బోర్నపల్లి వంతెన అంశాన్ని ప్రస్తావించారు గుర్తు చేశారు.
👉 ఎస్ఆర్ఎస్పీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా 0.25 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రాజుల చెరువును రోళ్లవాగుగా మార్చామని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ రోళ్లవాగును అధునీకరణ పేరిట 1టీఎంసీ నీటి నిల్వ కోసం 2014లో ₹ 60కోట్లు కేటాయించినా నేటికి ప్రాజెక్టు పనులు పూర్తికాకపోవడంతో నిర్మాణ వ్యయం ₹.130 కోట్లకు చేరిందన్నారు.
👉 రిజర్వాయర్ అటవీ ముంపు ప్రాంతానికి ప్రత్యామ్నయంగా భూములు కేటాయించలేదని, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కోసం బీమారంలో భూములు కేటాయించారని గుర్తు చేశారు. రిజర్వాయర్కు షేట్టర్లు బిగించకపోవడంతో మత్స్యకారులు రెండేళ్లుగా ఉపాధి కోల్పోతుండడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు.
👉 మరోసారి గెలిపిస్తే అల్లీపూర్, ఒడ్డెలింగాపూర్ను మండలాలుగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత చెప్పడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ప్రస్తుతం ఉన్నది. మీ ప్రభుత్వమే కదా..ఇప్పుడు మండలాలను ఏర్పాటు చేస్తే మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఎవరని.. మొన్న గెలిపిస్తే ఏం చేశారని నిలదీశారు.
👉 నియంతృత్వ, అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులు అవసరమని ప్రజలు, నాయకత్వం భావిస్తున్నారని అన్నారు.
👉 జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవిని బీసీ మహిళకు అప్పగించామని ఎమ్మెల్సీ కవిత గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, బీసీ మహిళకు కేటాయించిన స్థానంలో బీ సీ మహిళకు కేటాయించడంలో మీరు చేసింది ఏముంది.. జనరల్ స్థానాన్ని బీసీకి కేటాయించారా అని నిలదీశారు.
👉 కాంగ్రెస్ పార్టీ బీర్పూర్లో జనరల్ స్థానంలో బీసీకి కేటాయించింది అన్నారు.
👉 తెలంగాణ రాష్ట్ర సీఎంగా దళితుడినీ చేస్తామని మీ నాన్న చెప్పింది నిజం కాదా.? అని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. దళితుల్లో సీఎం గా అర్హులు ఎవరూ మీకు కనపడలేదా ?. అని నిలదీశారు.
👉 2014లో కనీసం దళితులకు ఉప ముఖ్యమంతి పదవి ఇచ్చారు. 2018లో ఆ స్థానంలో కూడా దళితులు లేకుండా చేశారని దుయ్యబట్టారు.
👉 తాను చిన్నప్పటి నుండి కష్టపడి ఎదిగానని అన్నారు.
👉 2007లో నా తమ్ముడిని కనీసం కౌన్సిలర్ గా కూడా పోటీకి అనుమతించలేదని గుర్తు చేశారు.
👉 ప్రజాభిమానం ఎదుట మీ డబ్బు సంచులు, మద్యం పనిచేయవని అన్నారు.
👉 తెలంగాణ ఉద్యమంలో ఆది నుండి కేవలం హరీశ్ రావు మాత్రమే ఉన్నారని, 2004లో కేసీఆర్ మంత్రి అయిన తర్వాత మాత్రమే కవిత, కేటీఆర్ అమెరికా నుండి వచ్చారని గుర్తు చేశారు.
👉 సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిధులకు అనుగుణంగా అమలు చేస్తాయి.
👉 దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టారని, ప్రజల అవసరాలు అనుగుణంగా 108,104 ప్రవేశపెట్టారని అన్నారు.
👉 పంట రుణాలు సకాలంలో చెల్లించిన వారికి రూ.5000 ప్రోత్సాహకం అందించామని గుర్తు చేశారు.
👉 కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే రాష్ట్ర ప్రజలపై భారం పడకుండ రాయితీ కల్పించామని గుర్తు చేశారు.
👉 గతంలో రాయికల్లో పెన్షన్ ₹.2000 ఇస్తామని ప్రకటిస్తే ఎలా ఇస్తారంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ₹ 2016 ప్రకటించారని గుర్తు చేశారు.
👉 పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న పీఆర్సీ మాదిరిగా నిరుపేదలకు పెన్షన్ ₹ 4000 ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
👉 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి బడ్జెట్లో ₹ 64వేల కోట్లు కేటాయించారని, 2014లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ₹ 1లక్ష కోట్లు ఉన్నదని 2023-24లో బడ్జెట్ 3లక్షలకు పెరిగిందని అన్నారు. ఆ మేరకు పెన్షన్ పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, పెన్షన్ ₹ 4000 ఇచ్చి తీరుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
👉 పోడు భూముల పట్టాల పంపిణీపై రాహుల్ గాంధీ అప్డేట్ కావాలనే వ్యాఖ్యను ఖండిస్తూ.. మీ లాగా స్కాంలలో అప్డేట్ కావడం మాకు సాధ్యంకాని పని అని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు బండ శంకర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మీ దేవేందర్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కాంగ్రెస్ జగిత్యాల రూరల్ మండలాధ్యక్షుడు జున్ను రాజేందర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దర రమేశ్ బాబు, కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరాజొద్దీన్ మన్సూర్, ఎంపీపీ మసర్థి రమేశ్, చందా రాధాకిషన్, పుప్పాల అశోక్, పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్పాషా, కాంగ్రెస్ జిల్లా కార్మిక శాఖ విభాగం అధ్యక్షుడు బొల్లి శేఖర్, జిల్లా మత్స్యశాఖ విభాగం అధ్యక్షుడు తో పారపు రజనీకాంత్, ద్యావర శ్రీనివాస్, బండారు స్వామి, మామిడిపల్లి మహిపాల్, దూలూరి సాయి, వినయ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు తదితరులు పాల్గొన్నారు.