మరణం తప్పదని …..
మానవీయ మనసు ఉందని…

J.SURENDER KUMAR.

కన్నీటి దారులు తుడుచుకుంటూ.. గుండెలు పగిలేలా రోదన, ఉబికి వస్తున్న పంటి బిగువున దాచుకుంటూ, అచ్చేతనంగా ( బ్రెయిన్ డెడ్) ఆసుపత్రిలో ఉన్న తన తల్లి మరణం తప్పదు అని, మానవీయ మనస్సుతో శరీరంలో పనిచేస్తున్న అవయాలను దానం చేసి ఇతరుల కుటుంబాలలో నెలకొన్న విషాదాన్ని ఆ తల్లి కుటుంబ సభ్యులు దూరం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన తోట సుశీల (65) గత కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అస్వస్థకు గురయ్యారు. ఆమె తనయుడు శంకర్ ఖరీదైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద కార్పొరేటర్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. వైద్య నిపుణులు రెండు రోజులపాటు ఆమెకు వైద్యం చికిత్స అందించి బ్రెయిన్ డెడ్ అయింది. ( అచేతన స్థితిలో ) కేవలం శరీరంలో మిగతా అవయవాలు పనిచేస్తున్నాయి. ఆమె జీవించడం కష్టం అంటూ వైద్యులు స్పష్టం చేశారు. ఆరోగ్యంగా పనిచేస్తున్న ఆమె కిడ్నీలు, కళ్ళు, లివర్, తదితర అవయాలు అనారోగ్యంతో ఉన్న ఇతరులకు దానం చేస్తే బాగుంటుందని సుశీల కుమారుడు శంకర్ కు * జీవన్ దాన్ * సభ్యులు వివరించారు.

అవయదానం చేసిన మాతృమూర్తి తోట సుశీల!


నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసిన కన్నతల్లి ఆస్పత్రిలో అచేతనంగా ఉన్న దృశ్యం. మరోవైపు తన ఇంట నెలకొన్న విషాదం ఇతరుల ఇంట చోటు చేసుకోవద్దనే మానసిక ఘర్షణ అతడిది. దీనికి తోడు రక్తసంబంధీకులు దేవేందర్, రమేష్, రాజేశ్వరి, కూతురు వైద్య విద్యార్థిని దాత్రి, శంకర్ తో. అవయదానం ఆవశ్యకత, అనారోగ్యం తో అవయవాల కోసం అవస్థలు పడుతున్న బాధిత కుటుంబాల్లో నెలకొన్న విషాదం నుంచి ఉపశమనం కలిగించడం కోసం అవయవ దానం చేయాలని కౌన్సిల్ చేశారు. అవయదానం చేసి ఈ నెల 8న ధర్మపురి గోదావరి నది తీరంలో తోట సుశీల దహన సంస్కారాలు జరిగాయి.
ఈ నేపథ్యంలో అచేతనంగా ఆసుపత్రిలో ఉన్న ఆ మాతృ మూర్తి అవయాలతో పలువురు కుటుంబాల లో నెలకొన్న విషాదం నుంచి విముక్తి పొందనున్నారు. అవయదానం అనంతరం సుశీల భౌతిక కాయానికి. ఆసుపత్రిలో పదవి విరమణ చేసిన ఆర్మీ అధికారులు గౌరవ సూచకంగా వందనం చేసి శ్రద్ధాంజలి ఘటించారు. కన్నతల్లి అవయ దానం చేసిన కుమారుడు శంకర్ చర్యలను పలువురు అభినందిస్తున్నారు.