👉నిరుపేద మైనార్టీ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ !
J.SURENDER KUMAR,
నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శనివారం జగిత్యాలలో విరూపాక్ష గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ( మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ) ఆధ్వర్యంలో 400 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, చొప్పదండి, కోరుట్ల, ఎమ్మెల్యే లు.. సంజయ్ కుమార్, రవిశంకర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ ఛైర్మెన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి కలిసి మైనారిటీలకు కుట్టు మిషన్ లను పంపిణీ చేసారు.
సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….
ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో ఆర్థికంగా బలోపేతమై ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. 50ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఏనాడు మైనార్టీ వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.

నిజమైన సెక్యూలర్ ప్రభుత్వం.. పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది బీఆరెస్ మాత్రమే అన్నారు. కేవలం ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ కి తెలుసు అన్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రం లో లేని విధంగా ఆర్ధికంగా వెనుక బడిన మైనార్టీ వర్గాల ప్రజలను మెరుగు పరిచేందుకు కుట్టు మిషన్ లను అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
మైనార్టీ వర్గాల అభ్యున్నతిని గుర్తించి.. మానవీయా కోణంలో అలోచించి వారి శ్రేయస్సు కోసం కృషి చేయడం జరుగుతుంది అన్నారు.
మైనార్టీ వర్గాల విద్యార్థులు చదువుకు దూరం కావొద్దని 204 మైనారిటీ రెసిడెన్సీయల్ పాఠ శాలాలను నెలకొల్పారని..విదేశాల్లో చదువు కునే విధంగా ₹ 20 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా రాష్ట్రంలో కబారస్తాన్ , మసీదులు మరమ్మత్తులు చేయడంతో పాటు కొత్త మసీదులు చర్చిల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో మైనార్టీ వర్గాలకు మరిన్ని పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, ఓమర్ జలీల్ ఐఏఎస్, తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు