పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించండి – ఎస్పీ భాస్కర్ !

J.SURENDER KUMAR,

పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ పోలీసు అధికారులను ఆదేశించారు

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు.
ప్రశాంత గణేశ్ నిమజ్జనం కు సహకరించాలి !


గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమర్జనమునకు సహకరించాలని ఎస్పీ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురి పట్టణo ,రాయపట్నం లో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలు నిమజ్జనం జరిగే గోదావరి నదీ తీర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసుల సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. భద్రత పరమైన అన్ని చర్యలను పోలీస్ శాఖ చేపట్టిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నది తీర ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గo లో ఇతర శాఖల తో సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా నిర్వాహకులు సహకరించాలి అని కోరారు. నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు, బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.అనంతరo రాబోవు అసెంబ్లీ ఎలక్షన్ లకు సంబంధించి రాయపట్నం వద్ద ఏర్పాటు చేయాల్సిన చెక్ పోస్ట్ ను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.


మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కమిషనర్ రమేష్, సి.ఐ రమణమూర్తి, ఎస్సై దత్తాత్రి, MRO కృష్ణ చైతన్య, ఇతర అధికారులు, సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.
బహిరంగ సభ గ్రౌండ్ పరిశీలన.!


అక్టోబర్ మొదటి వారంలో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కె.తారక రామారావు గ పర్యటన లో బాగంగా ధర్మపురి పట్టణంలో జరుగు సభాస్థలికి కళాశాల మైదానాన్ని, మరియు హెలిప్యాడ్ ను ఎస్పీ భాస్కర్ పరిశీలించారు. అనతరం బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సి. ఐ రమణమూర్తి, ఎస్సై దత్తాత్రే ఎస్పీ వెంట ఉన్నారు
.