పోలియో బాధితుడికి ఫేస్బుక్ మిత్రుల ఆర్థిక సహాయం!

👉ఉపాధి కోసం ₹118 లక్షలు విరాళాలు !

J.SURENDER KUMAR,

పోలియో భారీన పడి కుటుంబ పోషణ భారంగా మారిన ఓ బాధితుడి కుటుంబానికి , కిరాణం షాప్ ఏర్పాటు కోసం ఫేస్ బుక్ మిత్రులు ₹1.18 లక్షలు సాయం అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లా, వీరవాసరం మండలం, పెరికిపాలెం గ్రామానికి చెందిన అలవాల రాజు పుట్టుకతో పోలియో బాధితుడు. డి ఈడీ పూర్తి చేసిన రాజు కొద్ది సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ , ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహంలో ఉంటూ , భార్య ఇద్దరు పిల్లల్ని పోషించేవారు.
ఏడాది నుండి రాజుకు నడవడం తీవ్ర ఇబ్బందిగా మారడంతో ప్రైవేట్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ భారం అవడంతో కొంత అప్పులు చేశాడు.
రాజు కుటుంబ దీన స్థితిని ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ అక్కడి మిత్రుల ద్వారా తెలుసుకొని స్పందించి రాజు కుటుంబానికి కిరాణం షాప్ ఏర్పాటు కోసం సాయం అందించాలని సెప్టెంబర్ 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి రాజు బ్యాంకు ఖాతాను పొందుపరిచాడు.


తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు స్పందించి రాజు బ్యాంకు ఖాతాకు ₹ 1.18 లక్షలు సాయమందించారు. పట్టి డబ్బులతో రాజు తన గ్రామంలో కిరాణం కొట్టును ఏర్పాటు చేసుకున్నాడు. తన ఉపాధి కోసం సాయం అందించిన దాతలకు రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల ఓ పేద కుటుంబానికి దాతలు స్పందిస్తూ సాయమందించడం అభినందనీయమని రమేష్ అన్నారు.