J.SURENDER KUMAR.
బాల సాహిత్యం లో ధర్మపురి పట్టణం కు చెందిన సంగనభట్ల చిన్న రామకిష్టయ్య కు హైదరాబాదులో సోమవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రధానంగా చేసి సన్మానించారు.
గత 23 సంవత్సరాలుగా బాల సాహిత్యం లో 800 పైన పిల్లల కథలను రామకృష్ణయ్య రచన చేశారు. సోమవారం నాటికి దాదాపు 550 పైగా పిల్లల కథలు 30 పైన ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి.
పలు పత్రికలలో ప్రచురణ !
చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, ఈనాడు, బాలభారతం, సాక్షి, వెలుగు, తెలుగు విద్యార్థి ,బాలబాట, నవ తెలంగాణ, మన తెలంగాణ,మొలక, ప్రజా మంటలు, విశాలాంధ్ర, ప్రజాశక్తి , వార్త, సూర్య, నేటి నిజం, సప్తగిరి, ఉదయం మెట్రో, ఆంధ్రజ్యోతి, మయూఖ, నమస్తే తెలంగాణ, స్ఫూర్తి, ఆటవిడుపు చంద్రబాల, సహరి, నాని, హాస్యానందం, దిక్సూచి, స్రవంతి, చెకుముకి, దక్కన్ ల్యాండ్ తదితర వాటిలో ప్రస్తుతం అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో 5 వ తరగతి తెలుగు వాచకంలో ఇతర మాధ్యమాల వారికి పాఠ్యాంశంగా కనువిప్పు అనే కథ పక్షిసాక్ష్యం, బాలల నీతి కథలు 9,10 భాగాలు, చేప నవ్వింది, బుజ్జి కుందేలు ధైర్యం , రామకృష్ణ బాలల నీతి శతకం, నృహరీ శతకం వీరిచే ప్రచురించబడిన పుస్తకాలు. ఇంకా ముద్రణలో మరో 3 పుస్తకాలు ఉన్నాయి.
పురస్కారాల పరంపరం !
రంగినేని ట్రస్ట్, సిరిసిల్ల వారి బాలసాహిత్య పురస్కారం, శ్రీ వాణి సాహిత్య పరిషత్, సిద్దిపేట బాలసాహిత్య పురస్కారం, నవీన బాలానంద సంఘం, హైదరాబాద్ వారి బాలసాహిత్య పురస్కారం, అంగల కుదిటి సుందరాచారి, హైదరాబాద్ బాల సాహిత్య పురస్కారాలతో పాటు ఇంకా అనేక పురస్కారాల తో ఆయా సంస్థలు ఘనంగా సన్మానించి ప్రధానం చేశాయి. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం రావడం పట్ల పలువురు విద్యావేత్తలు, సంగీత సాహిత్య వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.