సామాన్యుడి ప్రాణం కాపాడేందుకు – స్పెషల్ హెలిక్యాప్టర్ లో గుండె తరలింపు!

👉గుంటూరు నుంచి తిరుపతి కి

👉ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానవీయ కోణం!

J.SURENDER KUMAR,

అచేతనంగా అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో ఉన్న ఓ యువకుడు, అతడు ప్రముఖుల కుటుంబ సభ్యుడు కాదు, ఆగర్భ శ్రీమంతుడు కాదు, చట్టసభలలో అతడి బందు గణం లేరు, అతడు సామాన్య పౌరుడు. అతడి ప్రాణ రక్షణ కోసం నిత్యం బిజీగా ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గుండె మార్పిడి సమాచారం తెలిసిన మరుక్షణంలోనే స్పందించి. అతడికి అవసరమైన గుండెను (గుండె మార్పిడి కోసం) గుంటూరు నుంచి తిరుపతి పట్టణంలోని ఆసుపత్రికి ఆగమేఘాలపై తెప్పించి సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఔదార్యాన్ని, మానవత్వాన్ని చాటుకున్న ఉదాంతం మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు చెందిన 19 ఏళ్ల కట్టా కృష్ణ, అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా..  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.
కర్నూల్ వాసికి గుండె అవసరం !
కర్నూలు జిల్లాకు చెందిన 33 ఏళ్ల శ్రీనివాసన్‌కు గుండె మార్పిడి శస్త్రచికిత్స తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన శ్రీనివాసన్‌ కు అత్యవసరంగా గుండె మార్పిడి అత్యవసరం ఉంది. అయితే గుండెను గుంటూరు నుంచి తిరుపతికి తీసుకురావాల్సి ఉంది. అత్యవసరంగా తరలించాల్సి ఉండటంతో రోడ్డు మార్గంలో తీసుకువెళ్లాలంటే చాలా ఆలస్యం అవుతుంది.

ఎమర్జెన్సీ కావడంతో రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుంది. విషయం అధికారులు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే స్పందించిన జగన్.. గుండె తరలించేందుకు వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని అధికారులకు హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు గుండెను హెలికాప్టర్ ద్వారా తిరుపతికి తెప్పిచ్చారు. ప్రస్తుతం పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స కొనసాగుతోంది.